Friday, September 5, 2014

చీకటి వెలుగుల రంగేళీ

చిత్రం :  విచిత్ర బంధం (1972)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల,  సుశీల


పల్లవి :


చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమే ఒక దీపావళి
చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి..


అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల
ఆశల వెలిగించు దీపాల వెల్లి


చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి


చరణం 1 :


అక్కయ్య కన్నుల్లో మతాబులు.. ఏ చక్కన్ని బావకో జవాబులు
మాటల్లో వినిపించు చిటపటలు.. మాటల్లో వినిపించు చిటపటలు
ఏ మనసునో కవ్వించు గుసగుసలు..


లలలా ఆహహహా ఆ.. ఆ.. ఆ..
చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి


చరణం 2 :


అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్ళకు.. మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్ళకు
బావా బావా పన్నీరు.. బావను పట్టుక తన్నేరు
బావా బావా పన్నీరు.. బావను పట్టుక తన్నేరు
వీధి వీధి తిప్పేరు .. వీసెడు గుద్దులు గుద్దేరు


అహహహహ
చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి


చరణం 3 :


అమ్మాయి పుట్టింది అమాసనాడు..
అసలైన గజదొంగ అవుతుంది చూడు..
పుట్టినరోజున దొరికాడు తోడు..
పున్నమి నాటికి అవుతాడు జోడు..


అహహహా ఆహహహా ఆ.. ఆ.. ఆ..
చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమే ఒక దీపావళి
మన జీవితమే ఒక దీపావళి



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1688

No comments:

Post a Comment