Friday, September 26, 2014

మెరిసే తారలదేరూపం?

చిత్రం :  సిరివెన్నెల (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  బాలు
 


పల్లవి : 


మెరిసే తారలదేరూపం? విరిసే పూవులదేరూపం?
అది నా కంటికి శూన్యం


మనసున కొలువై మమతల నెలవై.. వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం.. అపురూపం 


మనసున కొలువై మమతల నెలవై.. వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం.. అపురూపం 


చరణం 1 : 


ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా


ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా 

నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం.. అపురూపం


చరణం 2 :


ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా?
గానం పుట్టుక గాత్రం చూడాలా?
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా?
గానం పుట్టుక గాత్రం చూడాలా?


వెదురును మురళిగ మలచి
ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవన నాదం పలికిన నీవే
నా ప్రాణ స్పందన..
నీకే నా హృదయ నివేదన....

మనసున కొలువై మమతల నెలవై.. వెలసిన దేవిది ఏ రూపం
నా కన్నులు చూడని రూపం.. గుడిలో దేవత ప్రతిరూపం
నీ రూపం.. అపురూపం 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12045

No comments:

Post a Comment