Wednesday, September 24, 2014

సుప్రభాత సుందరి నీవు

చిత్రం :  సాహసవంతుడు (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల 

పల్లవి : 

సుప్రభాత సుందరి నీవు... ఉదయరాగ మంజరి నేను
కలుసుకున్న ప్రతిరోజూ... కలలు కన్న తొలిరోజు

సుప్రభాత సుందరి నీవు... ఉదయరాగ మంజరి నేను
కలుసుకున్న ప్రతిరోజూ... కలలు కన్న తొలిరోజు... కలలు కన్న తొలిరోజు 

చరణం 1 : 

నా వెలుగులు నలుగే పెడితే నీ జిలుగులు నేనే చూడాలి
నా సొగసులు సెగ పెడుతుంటే నీ మగసిరి నేనే చూడాలి

నా వెలుగులు నలుగే పెడితే నీ జిలుగులు నేనే చూడాలి
నా సొగసులు సెగ పెడుతుంటే నీ మగసిరి నేనే చూడాలి..
ఈ చూపుల రాపిడిలో ఆ సూర్యుడు ఉదయించాలి

సుప్రభాత సుందరి నీవు...ఉదయరాగ మంజరి నేను
కలుసుకున్న ప్రతిరోజూ...కలలు కన్న తొలిరోజు
 
చరణం 2 : 

నా పెదవికి దాహం పుడుతుంటే.. నీ పెదవులు నేనే వెదకాలి
నా వయసే వరదైపోతుంటే.. నీ వలపే వంతెన వేయాలి

నా పెదవికి దాహం పుడుతుంటే.. నీ పెదవులు నేనే వెదకాలి
నా వయసే వరదైపోతుంటే.. నీ వలపే వంతెన వేయాలి
ఈ దిక్కుల కలయికలో... ఆ చుక్కలు రవళించాలి

సుప్రభాత సుందరి నీవు... ఉదయరాగ మంజరి నేను
కలుసుకున్న ప్రతిరోజూ... కలలు కన్న తొలిరోజు
కలలు కన్న తొలిరోజు... కలలు కన్న తొలిరోజు

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=746

No comments:

Post a Comment