Sunday, September 7, 2014

గెలుపు మాదే సుమా

చిత్రం :  విజృంభణ (1986)
సంగీతం :  సత్యం
నేపధ్య గానం :  బాలు, చిత్ర



పల్లవి :


గెలుపు మాదే సుమా..  గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....
జీవితం ప్రతి పదం..  సమరమై సాగనీ...
జీవితం ప్రతి పదం..  సమరమై సాగనీ...
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....


జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...


చరణం 1 :



చీకటి ముసిరిన వేళా.. చిరు నవ్వె రవ్వల దీపం
మౌనం మూగిన వేళ.. ఒకమాటే మువ్వల నాదం
చీకటి ముసిరిన వేళా.. చిరు నవ్వె రవ్వల దీపం
మౌనం మూగిన వేళ.. ఒకమాటే మువ్వల నాదం
పదుగురు ఏమన్నా విధి పగ పడుతున్నా
ఎద చాచి ఎదిరించి కదిలేదే జీవితం


జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....
జీవితం.. జీవితం
ప్రతి పదం.. ప్రతిపదం
సమరమై సాగనీ...
జీవితం.. జీవితం
ప్రతి పదం.. ప్రతిపదం
సమరమై సాగనీ...

చరణం 2 :


కమ్మని మనసులు కళకళలాడే కాపురం
తొలకరి ఎండకు తళ తళలాడే గోపురం
మమతలు వెలిగే చల్లని ఇల్లే మందిరం
పాపలు తిరిగే వాకిలి సుందర నందనం
నిప్పులు పై పడినా ఉప్పెన ఎదురైనా
తడ బడకా వడి వడి గా నడిచెదే జీవితం...


జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా....
జీవితం ప్రతి పదం సమరమై సాగనీ...




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2811

No comments:

Post a Comment