Wednesday, September 24, 2014

వేదం అణువణువున నాదం





చిత్రం  :  సాగర సంగమం (1982)
సంగీతం  :  ఇళయరాజా
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  : బాలు,  ఎస్. పి. శైలజ  




పల్లవి : 


గా మా రీ గమగస
మగస గస నీసానిదమగ
దమగ మగ సరీసాని
గమాగానీ గమాగ మదామ
దనీద నిసానిరీ



వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్య వినోదం
నాలో రేగేనెన్నో హంసా నందీ రాగాలై
వేదం వేదం అణువణువున నాదం 


చరణం 1 : 


సాగరసంగమమే ఒక యోగం....
నిరిసనిదమగా గదమగరిసనీ నిరిసనిదమగా
మదనిసరీ సగారి మగదమ గమద నిసాని దనిమద గమ రిగస


సాగరసంగమమే ఒక యోగం.... క్షారజలధులే క్షీరములాయే
ఆ మధనం ఒక అమృతగీతం... జీవితమే చిరనర్తనమాయే
పదములు తామే పెదవులు కాగా
పదములు తామే పెదవులు కాగా... గుండియలే అందియలై మ్రోగ
వేదం అణువణువున నాదం 


చరణం 2 : 


మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ
అతిధిదేవోభవ .. అతిధిదేవోభవ

ఎదురాయె గురువైన దైవం.. ఎదలాయే మంజీర నాదం
గురు తాయె కుదురైన నాట్యం.. గురుదక్షిణైపోయే జీవం


నటరాజ పాదాన తలవాల్చనా.. నయనాభిషేకాన తరియించనా

నటరాజ పాదాన తలవాల్చనా..  నయనాభిషేకాన తరియించనా

సుగమము .. రసమయ ..సుగమము రసమయ... నిగమము భరతముగానా


వేదం అణువణువున నాదం
నా పంచప్రాణాల నాట్య వినోదం
నాలో రేగేనెన్నో హంసా నందీ రాగలై


జయంతితే సుకృతినో రస సిద్దా: కవీశ్వరాః
నాస్తిక్లేతేశాం యశ: కాయే జరామరణజంచ భయం!!
నాస్తి జరామరణజంచ భయం!!
నాస్తి జరామరణజంచ భయం!!



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5771

No comments:

Post a Comment