Thursday, September 18, 2014

వెన్నెల్లో విన్నాను సన్నాయి గీతం

చిత్రం :  తాతయ్య ప్రేమలీలలు (1980)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  మల్లెమాల
నేపధ్య గానం :  బాలు, జానకి
  




పల్లవి :



వెన్నెల్లో విన్నాను సన్నాయి గీతం
నీవేలే ఆ గానం.. నీవేలే నా ప్రాణం
కన్నుల్లో కన్నాను కల్యాణ దీపం
నీవేలే ఆ రూపం.. నీవేలే నా ప్రాణం...



వెన్నెల్లో విన్నాను సన్నాయి గీతం.. కన్నుల్లో కన్నాను కల్యాణ దీపం 



చరణం 1 :


ఆమని రమ్మంది అలవోకగా... అరుదైన అందాలు చవి చూడగా...

ఆమని రమ్మంది అలవోకగా... అరుదైన అందాలు చవి చూడగా...


కోయిల కూసింది సరి కొత్తగా.. శతకోటి భావాలు మొలకెత్తగా..
కోయిల కూసింది సరి కొత్తగా.. శతకోటి భావాలు మొలకెత్తగా.. 


విరజాజిలో నిను చూసితి... చూసి చేయ్ సాచి  దరి చేరితి..
చేరి నిలువెల్ల ముద్దాడితి... 


కన్నుల్లో కన్నాను...  కల్యాణ దీపం...
నీవేలే ఆ రూపం.. నీవేలే నా ప్రాణం...
కన్నుల్లో కన్నాను...  కల్యాణ దీపం... 


చరణం 2 : 


ఆహా.. లలలలలాలా..
లలలలలాలా.. అహా...
లలలలలాలా... లలలలలాలా.. అహా..  లలలలలాలా... 


సందిట జాబిల్లి జతకూడెను.. చలి తీరి రేరాణి చెలరేగెను..
సందిట జాబిల్లి జతకూడెను.. చలి తీరి రేరాణి చెలరేగెను..


వాకిలి తీసింది వనమాలికా... వగలెన్నో పోయింది చెలి కోరికా...
వాకిలి తీసింది వనమాలికా... వగలెన్నో పోయింది చెలి కోరికా... 


చిరుగాలినై దరి చేరితి.. చేరి మనసారా నిను తాకితి
తాకి పులకించి తరియించితి... 



వెన్నెల్లో విన్నాను సన్నాయి గీతం.. నీవేలే ఆ గానం.. నీవేలే నా ప్రాణం
కన్నుల్లో కన్నాను కల్యాణ దీపం.. నీవేలే ఆ రూపం.. నీవేలే నా ప్రాణం... 


లలాలా.. అహా..హా.... లలాలా..  ఉ..ఉ.... 

 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9605

No comments:

Post a Comment