Wednesday, September 3, 2014

పిలిచె పిలిచె అనురాగం

చిత్రం :  లాయర్ విశ్వనాథ్ (1978)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  సినారె

నేపథ్య గానం :  సుశీల

పల్లవి :

రూ రూ రూరురూరు..
రూ రూ రూరురూరు..

పిలిచె పిలిచె అనురాగం.. పలికె పలికె నవగీతం..

పిలిచె పిలిచె అనురాగం.. పలికె పలికె నవగీతం

అతడు నను చేరగానే..

బ్రతుకు పులికించె తానే... బ్రతుకు పులకించె తానే

పిలిచె పిలిచె అనురాగం.. పలికె పలికె నవగీతం

చరణం 1 :

రూ రూ రూరురూరు..

రూ రూ రూరురూరు..

ఈ పడుచు గాలి నాపైన వాలి..

ఏమమ్మ ఇంత సిగ్గు ఎందుకన్నది..

ఏ బదులు రాక.. నిలువలేక..

జువ్వాడె నా మనసేమో నవ్వుకున్నదీ

పిలిచె పిలిచె అనురాగం పలికె పలికె నవగీతం..

చరణం 2 :

రవ్వంత బిడియం.. పువ్వంత ప్రణయం..

నా రాజు చూపుల్లోనే దాచుకున్నాడు

నే దాచలేక.. ప్రేమలేఖ..

అందాల మబ్బుల ద్వారా అందజేస్తాను...

పిలిచె పిలిచె అనురాగం.. పలికె పలికె నవగీతం..
పిలిచె పిలిచె అనురాగం.. పలికె పలికె నవగీతం

అతడు నను చేరగానే..
బ్రతుకు పులికించె తానే... బ్రతుకు పులకించె తానే
పిలిచె పిలిచె అనురాగం.. పలికె పలికె నవగీతం

No comments:

Post a Comment