Wednesday, September 10, 2014

ఓంకార నాదానుసంధానమౌగానమే

చిత్రం :  శంకరాభరణం (1980)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం : బాలు, జానకి  



పల్లవి :


ఓం... ఓం...
ఓంకార నాదాను సంధానమౌగానమే.. శంకరాభరణము
ఓంకార నాదాను సంధానమౌగానమే.. శంకరాభరణము
శంకరా భరణము...


శంకర గళ నిగళము ... శ్రీహరి పద కమలమూ
శంకర గళ నిగళము... శ్రీహరి పద కమలమూ
రాగరత్న మాలికా తరళమూ.. శంకరాభరణమూ... 



చరణం 1 :


శారద వీణా..... ఆ.....
శారద వీణా రాగ చంద్రికా.. పులకిత శారద రాత్రము..
శారద వీనా రాగ చంద్రికా.. పులకిత శారద రాత్రము..
నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణ గీతము
నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణ గీతము


రసికులకనురాగమై.. రసగంగలో తానమై...
రసికులకనురాగమై.. రసగంగలో తానమై
పల్లవించు సామవేద మంత్రము.... శంకరాభరణమూ
శంకరా భరణమూ... 


చరణం 2 :


అద్వైత సిద్ధికి.. అమరత్వ లబ్ధికి... గానమె సొపానము....
అద్వైత సిద్ధికి.. అమరత్వ లబ్ధికి.. గానమె సొపానము....


సత్వ సాధనకు.. సత్య శోధనకు.. సంగీతమే ప్రాణమూ
సత్వ సాధనకు.. సత్య శోధనకు ..సంగీతమే ప్రాణమూ


త్యాగరాజ హృదయమై.. రాగరాజ నిలయమై..
త్యాగరాజ హృదయమై.. రాగరాజ నిలయమై..
ముక్తినొసగు భక్తి యోగ మార్గము.. మృతియెలేని సుధాలాప స్వర్గము
శంకరాభరణమూ..


ఓంకార నాదానుసంధానమౌగానమే శంకరాభరణమూ 



చరణం 3 :


పాదాని... శంకరాభరణము
పమగరి గమపదని.. శంకరాభరణము


సరిసా నిదప నిసరి దపమ గరిగ పమగ పమద పనిద సనిగరి శంకరాభరణము
ఆహా


దపా దమా మాపాదపా... మాపాదపా
దపా దమా మదపామగా... మదపామగా
గమమదదనినిరి మదదనినిరిరిగ
నిరిరిగగమమద సరిరిససనినిదదప.. శంకరాభరణమూ....


రీససాస రిరిసాస రీసాస సరిసరీస రిసరీసరీసనిద నీ నీ నీ
దాదనీని దదనీని దానీని దనిద దనిద దని దగరిసానిదప
దా దా ద
గరిగా మమగా
గరిగా మమగా
గరి గమపగా మపద మదపమ గరిసరి సరిగసరీ
గరి మగపమదప
మగపమదప నిదపమదప నిదసనిదప నిదసనిరిస
గరీసా గరిసనిదరీసా రిసనిదపసా గరిసనిద నిసనిదప
సనిదపమ నీసాని
నిసనిదపనీదా సనిదపమపా రిసనిదప సరిదపమ గమమగరి
గమదా
నిసనిపద మపా నిసనిదప నీ దపమగరి రిసనిదప
మగరిసరిసని... శంకరాభరణము
శంకరాభరణమూ...




No comments:

Post a Comment