Thursday, September 25, 2014

ఝుమ్మంది నాదం

చిత్రం :  సిరి సిరి మువ్వ (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, సుశీల
   



పల్లవి :



ఝుమ్మంది నాదం...  సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా...  చెలరేగింది ఒక రాసలీలా
ఝుమ్మంది నాదం...  సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా... చెలరేగింది ఒక రాసలీలా 


చరణం 1 :


ఎదలోని సొదలా...  ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా.. కలల వరదలా
ఎదలోని సొదలా.. ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా.. కలల వరదలా

చలిత లలిత పద కలిత కవిత లెగ సరిగమ పలికించగా
స్వర మధురిమ లొలికించగా... సిరిసిరి మువ్వలు పులకించగా 

ఝుమ్మంది నాదం...  సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా... చెలరేగింది ఒక రాసలీలా


చరణం 2 :


నటరాజ ప్రేయసి... నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
నటరాజ ప్రేయసి... నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
ఆకాశమై పొంగే ఆవేశం... కైలాశమే వంగే నీ కోసం 

ఝుమ్మంది నాదం...  సయ్యంది పాదం


చరణం 3 :


మెరుపుంది నాలో...  అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో... అది నీ మువ్వ పిలుపు


చినుకు చినుకులో చిందు లయలతో... కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు... ఈ పొంగులే ఏడు రంగులుగా
 

ఝుమ్మంది నాదం...  సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా... చెలరేగింది ఒక రాసలీలా



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4813

No comments:

Post a Comment