Wednesday, September 10, 2014

హాయి హాయిగా జాబిల్లి

చిత్రం :  వెలుగు నీడలు (1961)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపథ్య గానం :  ఘంటసాల, సుశీల 

పల్లవి :

హాయి హాయిగా జాబిల్లి.. తొలిరేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వసాగే ఎందుకో...
మత్తుమందు జల్లి... నవ్వసాగే ఎందుకో

హాయి హాయిగా జాబిల్లి.. తొలిరేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వసాగే ఎందుకో
మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో
 
చరణం 1 :

తళతళ మెరిసిన తారక ... తెలి వెలుగుల వెన్నెల దారుల
తళతళ మెరిసిన తారక ... తెలి వెలుగుల వెన్నెల దారుల
కోరి పిలిచెను తన దరిచేరగా.. మది కలచేనో తీయని కోరిక

హాయి హాయిగా జాబిల్లి...తొలిరేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వసాగే ఎందుకో...మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో 

చరణం 2 :

మిలమిల వెలిగే నీటిలో... చెలి కలువల రాణి చూపులో
మిలమిల వెలిగే నీటిలో... చెలి కలువల రాణి చూపులో

సుమదళములు పూచినా తోటలో... తొలివలపుల తేనెలు రాలేనో

హాయి హాయిగా జాబిల్లి...తొలిరేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వసాగే ఎందుకో...మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో
 
చరణం 3 :

విరిసిన హృదయమే వీణగా...మధురసముల కొసరిన వేళల
విరిసిన హృదయమే వీణగా...మధురసముల కొసరిన వేళల

తొలి పరువములొలికెడు సోయగం..కని పరవశమొందెనో మానసం

హాయి హాయిగా జాబిల్లి...తొలిరేయి వెండి దారాలల్లి
మందు జల్లి నవ్వసాగే ఎందుకో...మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1558

3 comments:

  1. మీ బ్లాగు బావుంది.

    ReplyDelete
  2. https://t.me/joinchat/AAAAAEiAh87VJUU-dQnevg

    telegu old songs link in telegram.
    pls join here

    ReplyDelete
  3. https://t.me/joinchat/AAAAAEiAh87VJUU-dQnevg

    ReplyDelete