Wednesday, September 3, 2014

వంశీ కృష్ణా.. యదు వంశీ కృష్ణా

చిత్రం :  వంశవృక్షం (1980)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, ఎస్. పి. శైలజ   



పల్లవి :



వంశీ కృష్ణా.. యదు వంశీ కృష్ణా
వంశీ కృష్ణా. యదు వంశీ కృష్ణా
గోప వనిత హృదయ సరసి.. రాజ హంసా
కృష్ణా..కృష్ణా
గోప వనిత హృదయ సరసి.. రాజ హంసా
కృష్ణా..కృష్ణా..
వంశీ కృష్ణా... యదు వంశీ కృష్ణా 


చరణం 1 :


పుట్టింది రాజకుమారుడుగా.. పెరిగింది గోపకిశోరుడుగా
తిరిగింది యమునా తీరమున.. నిలిచింది గీతాసారంలో


గోప వనిత హృదయ సరసి.. రాజ హంసా..
కృష్ణా..కృష్ణా..
వంశీ కృష్ణా.. యదు వంశీ కృష్ణా.. 


చరణం 2 :


నోటిలో ధరణి చూపిన కృష్ణా..
గోటితో గిరిని మోసిన కృష్ణా..
ఆటగా రణము నడిపిన కృష్ణా..
ఆటగా రణము నడిపిన కృష్ణా..
ఆటగా బ్రతుకు గడిపిన కృష్ణా...
ఆటగా బ్రతుకు గడిపిన కృష్ణా...
కిల కిల మువ్వల కేళీ కృష్ణా..
తకదిమి తకదిమి తాండవ కృష్ణా..


కేళీ కృష్ణా.. తాండవ కృష్ణా!
కేళీ కృష్ణా! తాండవ కృష్ణా!
కేళీ కృష్ణా! తాండవ కృష్ణా!



No comments:

Post a Comment