Tuesday, September 23, 2014

నన్ను ఎవరో తాకిరి

చిత్రం :  సత్తెకాలపు సత్తయ్య (1969)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 


పల్లవి :


నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి


నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి


నన్ను ఎవరో చూచిరి .. కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి


నన్ను ఎవరో చూచిరి .. కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి 


చరణం 1 :


ఆ బుగ్గల లేత సిగ్గు.. నా కోసం పూచినదేమోఆ బుగ్గల లేత సిగ్గు.. నా కోసం పూచినదేమోసిగ్గులన్ని దోచుకుంటే.. తొలివలపే ఎంతో హాయి

ఆ మగసిరి అల్లరి అంతా నా కోసం దాచినదేమో
ఆ మగసిరి అల్లరి అంతా నా కోసం దాచినదేమో
అందగాడు ఆశపెట్టే సయ్యాటలు ఎంతో హాయి  

నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి

ఆ.... ఆ..... ఆ..... ఆ.........ఆ.... ఆ..... ఆ..... ఆ.........



చరణం 2 :


ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో
ఆ నల్లని జడలో మల్లెలు నా కోసం నవ్వినవేమో
మల్లెలాగ నేను కూడా జడలోనే ఉంటే హాయి


ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో
ఆ చల్లని కన్నుల కాంతి నా కోసం వెలిగినదేమో
కాంతిలాగ నేను కూడా ఆ కన్నుల నిలిచిన చాలు  


నన్ను ఎవరో చూచిరి .. కన్నె మనసే దోచిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి


నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి
చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి

No comments:

Post a Comment