చిత్రం : సిరి సిరి మువ్వ (1978) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు ఒక గొంతులోనే పలికింది అది ఏ రాగమని నన్నడిగింది ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు ఒక గొంతులోనే పలికింది అది ఏ రాగమని నన్నడిగింది
అది మనవూరి కోకిలమ్మా నిన్నడిగింది కుశలమమ్మా అది మనవూరి కోకిలమ్మా నిన్నడిగింది కుశలమమ్మా
నిజమేమొ తెలుపు నీ మనసు తెలుపు ఎగిరేను మన వూరివైపు అది పదిమంది కామాట తెలుపు నిజమేమొ తెలుపు నీ మనసు తెలుపు ఎగిరేను మన వూరివైపు అది పదిమంది కామాట తెలుపు
గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే ఎల్లువ గోదారల్లే వెన్నెట్లో గోదారల్లె ఎదలో ఏదోమాట రొదలో ఏదో పాట గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే ఎల్లువ గోదారల్లే
No comments:
Post a Comment