Saturday, September 13, 2014

ఆ చింత నీకేలరా

చిత్రం :  శుభోదయం (1980)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  సుశీల  



పల్లవి :


మందార మకరంద మాధుర్యమున దేలు
మధుపంబు పోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికల తూగు
రాయంచ చనునే తరంగిణులకు...


ఆ..ఆ..
ఆ చింత నీకేలరా... ఆ చింత నీకేలరా స్వామీ.. నీ చెంత నేనుండగా..
ఆ చింత నీకేలరా... ఆ చింత నీకేలరా స్వామీ.. నీ చెంత నేనుండగా..
ఆ చింత నీకేలరా..


సొంతమైన ఈ సొగసునేలక పంతమేల పూబంతి వేడగా
సొంతమైన ఈ సొగసునేలక పంతమేల పూబంతి వేడగా
ఆ చింత నీకేలరా? 



చరణం 1 :


సరసాల మనుగడ సగపాలు చేసి...
వరసైన నా యీడు నీ తోడు పెట్టి
సరసాల మనుగడ సగపాలు చేసి...
వరసైన నా యీడు నీ తోడు పెట్టి...
అరుదైన మురిపాల పెరుగు మీగడలన్నీ
కరిగించి కౌగిళ్ళ తినిపించగా....
ఆ..ఆ..ఆ..ఆ  


చరణం 2 :


ఆ వంక ఆ వెన్నెలమ్మా.. ఈ వంక ఈ వన్నెలమ్మ
ఆ వంక ఆ వెన్నెలమ్మా.. ఈ వంక ఈ వన్నెలమ్మ
యే వంక లేని నెలవంక నేనమ్మా...
నీకింక అలకెందుకమ్మా?


లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు
కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర
మరుగునే సాంద్రనీహారములకు
వినుత గుణశీల మాటలు వేయునేలా? 



No comments:

Post a Comment