Saturday, September 13, 2014

నీ జడకుచ్చులు

చిత్రం :  శుభలేఖ (1982)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి



పల్లవి :


గురుర్బ్రహ్మ గురుర్విష్ణూ గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః


నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక
నీ వెనుక నా నడక నీ కెందుకులే కినుక
ఓ..నవమి చిలుక.. నగవు చిలుక.. తగదు అలుక.. తగవు పడక


నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక
నీ వెనుక నా నడక నీ కెందుకులే కినుక
ఓ..నవమి చిలుక.. నగవు చిలుక.. తగదు అలుక.. తగవు పడక


చరణం 1 :


అడిగింది కన్నెయీడు శెలవింక..  నిన్నే శెలవింకా
ఇచ్చే కౌగిళ్ళల్లోనే తమకి నెలవింక.. ఇస్తా నెలవంకా


ఆపాలి అబ్బాయిగారు చొరవింక..  చిలిపి చొరవింకా
పచ్చ పచ్చని కాపురాలే మనవింక.. వింటే మనవింకా


అలగక తొలగక నను విడి కదలక
మనకిక కలదిక మరువక కలయిక
అలగక తొలగక నను విడి కదలక
మనకిక కలదిక మరువక కలయిక
పరువపు తెరవడి చలి చలి అలజడి చాలింకా


ఓ..నవమి చిలుక నగవు చిలుక తగదు అలుక తగవు పడక


నీ చిరునవ్వులు నా సిగ పువ్వులు కనుక
నా వెనుక నీ నడక నాకెందుకులే కినుక
ఓ.. ఉలికి పడక కలికి పలుక కలత పడక కలత పడక


చరణం 2 :



తననం తననం తననం తననం తనన దంద తన దం దం దం దం తందా..
తననం తననం తననం తననం తనన తంద దం దా నా నా నా...
హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్..
గూడ్!
హ్మ్మ్..హ్మ్మ్..హ్మ్మ్?
యేవైందండీ?
ఆహా!
పపదని పపపప దని మమ పద మమమమ పద
లా ల లా ల లా ల లా ల...



మనసైన మరునాడే త్వరపడక.. నువ్వు జొర పడక
పొద్దు వాలేటి వేళల్లోన చొరపడకా.. కొంగు ముడి పడక


ఆపాలి అమ్మయిగారు గొడవింకా.. మతులే పడవింకా
నీవు నేనైన రేవు చేరే పడవింకా.. సాగే గుడివంక


బుడి బుడి చూపుల బుగ్గలు గిచ్చక
పొడి పొడి మాటల పొద్దులు పుచ్చక
బుడి బుడి చూపుల బుగ్గలు గిచ్చక
పొడి పొడి మాటల పొద్దులు పుచ్చక
మనసుకు మమతకు మనువులు జరిగితే చాలింకా


ఓ..ఉలికి పడక.. కలికి పలుక.. కలత పడక.. కలత పడక


నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు కనుక
నీ వెనుక నా నడక నీ కెందుకులే కినుక
ఓ..నవమి చిలుక.. నగవు చిలుక.. తగదు అలుక.. తగవు పడక



No comments:

Post a Comment