Saturday, September 27, 2014

కళ్యాణ వైభోగమే

చిత్రం  :  సీతారామకళ్యాణం (1986)
సంగీతం  :  కె.వి. మహదేవన్
గీతరచయిత  : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం  : బాలు, సుశీల 




పల్లవి :


విడిపోము మనమూ...ఈ ఎడబాటు క్షణమూ...ఆపైన కళ్యాణము
కళ్యాణ వైభోగమే ... కళ్యాణ వైభోగమే...
శ్రీ సీతారాముల కళ్యాణమే... మన మాంగళ్యధారణ శుభలగ్నమే


కళ్యాణ వైభోగమే.. శ్రీ సీతారాముల కళ్యాణమే...
మన మాంగళ్యధారణ శుభలగ్నమే... కళ్యాణ వైభోగమే ...ఏ... 



చరణం 1 :



అనుకున్నా కొన్నాళ్ళ వనవాసము... మునుముందు కావాలి మధుమాసము
అనుకున్నా కొన్నాళ్ళ వనవాసము... మునుముందు కావాలి మధుమాసము


మన ప్రేమ తుది లేని ఆకాశము...
మన ప్రేమ తుది లేని ఆకాశము....ప్రతి రోజు పూర్ణిమా శ్రావణము
కళ్యాణ వైభోగమే...ఏ... 



చరణం 2 :




మరులెల్ల మరుమల్లె విరిమాలగా ... మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా
మరులెల్ల మరుమల్లె విరిమాలగా ... మురిపాల ముత్యాలె తలంబ్రాలుగా


హృదయాల నామాలె వేదాలుగా...
హృదయాల నామాలె వేదాలుగా ... మన అంతరంగాలే వేదికగా...
కళ్యాణ వైభోగమే....ఏ... 


చరణం 3 :



వలచాము నిలిచాము ఒక దీక్షగా... మనసైన మనసొకటే సాక్షిగా
వలచాము నిలిచాము ఒక దీక్షగా... మనసైన మనసొకటే సాక్షిగా


గెలిచాము కలిశాము దివిమెచ్చగా ...ఆ ..ఆ..
గెలిచాము కలిశాము దివిమెచ్చగా .... కలకాలముందాము నులివెచ్చగా...


కళ్యాణ వైభోగమే ....
శ్రీ సీతారాముల కళ్యాణమే... మన మాంగళ్యధారణ శుభలగ్నమే...
కళ్యాణ వైభోగమే ...ఏ...
శ్రీ సీతారాముల కళ్యాణమే... మన మాంగళ్యధారణ శుభలగ్నమే
కళ్యాణ వైభోగమే.... 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10269

No comments:

Post a Comment