Friday, September 19, 2014

తొంగి తొంగి చూడమాకు

చిత్రం :  శ్రీరంగ నీతులు (1983)
సంగీతం :  చక్రవర్తి  
గీతరచయిత  :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల      



పల్లవి :

హె... హె... హే.. లలలలా..
హె.... హె... హే.. లలలలా.. 


తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా


దోరదోర వయసులో చందమామా
ఆ తారనేం చేశావు చందమామా


వావి వరస చూశావా చందమామా
నీ వయసునాపుకున్నావా చందమామా


అంత మచ్చ పెట్టుకుని చందమామా
నీకెందుకింత మత్సరం చందమామా 


తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా



చరణం 1 :



వెన్నెల్లో వేడుకుంది... కన్నుల్లో కోరికుంది ముద్దుగుమ్మా
ఇద్దర్లో వేగముంది... వద్దన్నా ఆగకుంది పైడిబొమ్మా


పూల బాణాలు వేసేకుందమా?
ప్రేమ గాయాలు చేసుకుందామా?
పూల బాణాలు వేసేకుందమా?
ప్రేమ గాయాలు చేసుకుందామా?


కలిసే ఉందామా కరిగే పోదామా
చుప్పనాతి చుక్కల్ని దాటుదామా
చూడలేని చంద్రుణ్ణి తరుముదామా 


తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా

తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా



చరణం 2 :



గుండెల్లో తాళముంది... గొంతుల్లో రాగముంది కలుపుదామా
పొద్దెంతో హాయిగుంది... ఎంతెంతో పొద్దువుంది గడుపుదామా


ముద్దు మురిపెంలో మునిగిపోదమా?
తీపిగా వానలో తేలిపోదమా?
ముద్దు మురిపెంలో మునిగిపోదమా?
తీపిగా వానలో తేలిపోదమా?


స్వర్గం చూద్దామా...  సొంతం చేద్దామా
మత్సరాలు మాననీ మచ్చమామా
దండమెట్టి ఇద్దరం కొలుచుకోమా



తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా


దోరదోర వయసులో చందమామా
ఆ తారనేం చేశావు చందమామా


వావి వరస చూశావా చందమామా
నీ వయసునాపుకున్నావా చందమామా


అంత మచ్చ పెట్టుకుని చందమామా
నీకెందుకింత మత్సరం చందమామా 


తొంగి తొంగి చూడమాకు... చందమామా
నీ సంగతంత తెలుసు మాకు... చందమామా


తొంగి తొంగి చూడమాకు... చందమామా

తొంగి తొంగి చూడమాకు... చందమామా



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1885

No comments:

Post a Comment