Tuesday, September 23, 2014

పొరుగింటి మీనాక్షమ్మను

చిత్రం :  సంబరాల రాంబాబు (1970)
సంగీతం : వి. కుమార్
గీతరచయిత :  రాజశ్రీ
నేపధ్య గానం :  పిఠాపురం, సుశీల  

పల్లవి :

పొరుగింటి మీనాక్షమ్మను చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా...
మిమ్మల్నే...
పొరుగింటి మీనాక్షమ్మను చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా...

పగలంతా ఇద్దరకూ తగవులు ఎన్నున్నా..
పగలంతా ఇద్దరకూ తగవులు ఎన్నున్నా..
చీకటి పడితే పక్కకి చేరి రాజీ కొస్తాడు
కోరిన చీరలు ఇస్తాడు...

పొరుగింటి మీనాక్షమ్మను చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా...

పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే...
వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే...
ఆండాళ్ళూ...
పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే...
వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే..

తప్పని సరిగా ప్రతి సినిమాకు వెళతావూ ముందే..
తప్పని సరిగా ప్రతి సినిమాకు వెళతావూ ముందే..
జీతం కాస్తా సినిమాకైతే మిగిలిదేముందే?
చీరకు మిగిలేదేముందే...  

పొరుగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే...
వాడికి జీతం కంటే గీతం ఎక్కువ తెలుసుకోవే...

చరణం 1 :

పెళ్ళై మూడు ఏళ్ళు గడిచినా పొందిందేమిటి ఆండాళ్ళు...
పెళ్ళై మూడు ఏళ్ళు గడిచినా పొందిందేమిటి ఆండాళ్ళు...
తల్లీ తండ్రీ ప్రేమ గుర్తు గా పుట్టెను బుల్లి నామాలు
తల్లీ తండ్రీ ప్రేమ గుర్తు గా పుట్టెను బుల్లి నామాలు

వగలను చూపిస్తారే గాని నగలెపుడైనా పెట్టారా
వగలను చూపిస్తారే గాని నగలెపుడైనా పెట్టారా
ఓ ముత్యాల బేసరి ఇచ్చి ముక్కుకి అందం తెచ్చారా....
నా ముక్కుకి అందం తెచ్చారా....
ఉద్యోగం ఒక మెట్టు దాటనీ కోరినదిస్తా నీకూ
ఇష్టం లేదని చెప్ప కూడదా ఎందుకు లెండి సాకు....
 
పొరుగింటి మీనాక్షమ్మను చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా...

చరణం 2 :

మాటలతోటీ రెచ్చ గొట్టకే నన్నూ....
బెదిరింపులకు లొంగే దాన్ని కానూ...
కోపం వస్తే మనిషిని కాను నేనూ...

ఏం చేస్తారు..?
చెవులు మెలేస్తా..!! ఇంకేంచేస్తారు..?
దుంప తెంపేస్తా..!! ఆ తరువాతా..!!
తాట వొలుస్తా...!! హా హ హ హా....!!! 

పొరుగింటి మీనాక్షమ్మను చూసారా
వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా... హా హ హ హా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6102

No comments:

Post a Comment