Thursday, September 11, 2014

కలకల విరిసి జగాలే పులకించెనే

చిత్రం  :  శభాష్ రాముడు (1959)
సంగీతం  : ఘంటసాల
గీతరచయిత  : శ్రీశ్రీ
నేపధ్య గానం  : ఘంటసాల 



పల్లవి :


కలకల విరిసి జగాలే పులకించెనే
కలకల విరిసి జగాలే పులకించెనే


వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే
కలకల విరిసి జగాలే పులకించెనే 



చరణం 1 :


ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..
అలరుల తోటా ..అందాల బాట
హాయిగ పాడే కోయిల పాట.. కోయిల పాట..
తెలియని కోరికలేవో కలిగించెనే...


కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే...


చరణం 2 :

ఓ.. ఓ.. ఓ.. ఓ.. ఓ..

చల్లని గాలి ...మెల్లగ వీచే ..

హృదయము దూసి ...మనసే దోచే..మనసే దోచే...

మనసులు నిండి ప్రణయాలే చెలరేగెనే


కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే....


చరణం 3 :


ఓ..ఓ...ఓ..ఓ...ఓ..ఓ...
చెలి చూపులలో అనురాగాలు..
నిజమేనా అని అనుమానాలు...అనుమానాలు..
సందేహలేలా హృదయాలే మన సాక్షులు...


కలకల విరిసి జగాలే పులకించెనే
వలపులు కురిసి సుఖాలే చిలికించెనే...
కలకల విరిసి జగాలే పులకించెనే....




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=514

No comments:

Post a Comment