Sunday, September 21, 2014

బాబా సాయి బాబా

చిత్రం :  శ్రీషిర్డి సాయిబాబా మహత్యం (1986)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు 

పల్లవి :

బాబా సాయి బాబా... బాబా సాయి బాబా..
నీవూ మావలె మనిషివని... నీకూ మరణం ఉన్నదని..
అంటే ఎలా నమ్మేది... అనుకుని ఎలా బ్రతికేది

బాబా సాయి బాబా... బాబా సాయి బాబా 

చరణం 1 :

నువ్వే మరణించావంటే... ఆ దేవుడెలా బ్రతికుంటాడు
నువ్వే మరణించావంటే... ఆ దేవుడెలా బ్రతికుంటాడు
నువ్వే దేవుడివైతే ఆ మృత్యువెలా శాసిస్తాడు
తిరుగాడే కోవెల నీ దేహం... శిధిలంగా అవుతుందా....
పిలిచినంతనే పలికే దైవం... మూగై పోతాడా

బాబా సాయి బాబా... బాబా సాయి బాబా
నీవూ మావలె మనిషివని... నీకూ మరణం ఉన్నదని
అంటే ఎలా నమ్మేది... అనుకుని ఎలా బ్రతికేది
బాబా సాయి బాబా... బాబా సాయి బాబా 

చరణం 2 :

దివిలో వున్నా భువిలో వుండే మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోనా ఎక్కడ వున్నా.. ముక్కలు చెక్కలు చేసుకురా
దివిలో వున్నా భువిలో వుండే మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోనా ఎక్కడ వున్నా.. ముక్కలు చెక్కలు చేసుకురా

సూర్యచంద్రులను చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయ్యా
గ్రహములు గోళాలిహపర శక్తులు.. గగ్గోలెత్తగ రావయ్యా
నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం
నువ్వు లేకుంటే నువ్వు రాకుంటే ఎందుకు మాకు ఈ లోకం

లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోనీ
ముల్లోకాలు కల్లోలంలో శూన్యం అయిపోనీ

రగిలే కాలాగ్ని ఎగిసే బడబాగ్ని
దైవం ధర్మాన్ని దగ్ధం చేసేయనీ
నేనే ఆత్మైతే... నీవే పరమాత్మా....
నీలో నన్ను ఐక్యం ఐపొనీ.... పోనీ

No comments:

Post a Comment