Friday, September 26, 2014

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ

చిత్రం :  సీతాకోకచిలుక (1981)
సంగీతం  :  ఇళయరాజా
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  : బాలు, వాణీ జయరాం
   
పల్లవి : 

ఆ... ఆ... ఆ... 

తందనాన... తందానాననాన
తందానాననాన తందానాననాన ఆ...
ఆ...ఆ...

తందనాన ఆ... తందనాన... ఆ...
తందనాన... తందానాననాన
తందానాననాన తందానాననాన ఆ...
తందనాన ఆ... తందనాన... ఆ...

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ..  పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ.. పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
అందమైన రంగవల్లులై... ఎండలన్ని పూలజల్లులై
ముద్దుకే పొద్దుపొడిచి...

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ...  పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా 

చరణం 1 : 

ఓ... చుక్కా  నవ్వవే.. వేగుల చుక్కా నవ్వవే
కంటి కోలాటాలా.. జంట పేరంటాలా
ఓ... చుక్కా నవ్వవే.. నావకు చుక్కా నవ్వవే
పొందు ఆరాటాలా.. పొంగు పోరాటాలా

మొగ్గ తుంచుకుంటే.. మొగమాటాలా
బుగ్గ దాచుకుంటే.. బులపాటాలా
దప్పికంటే తీర్చడానికిన్ని తంటాలా

మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ.. పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ.. పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా 

చరణం 2 :

ఓ... రామచిలకా చిక్కని ప్రేమమొలకా
గూడు ఏమందమ్మా.. ఈడు ఏమందమ్మా

ఈడుకున్న గూడు నువ్వే గోరింకా
తోడుగుండిపోవె కంటి నీరింక
పువ్వు నుంచి నవ్వునూ తుంచలేరులే ఇంకా

మిన్నేటి సూరీడు.. లా లా లా లా...
మిన్నేటి సూరీడు.. లా లా లా లా...
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ.. పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా

అందమైన రంగవల్లులై..
ఎండలన్ని పూలజల్లులై..
ముద్దుకే పొద్దుపొడిచి..
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ... పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా
 
No comments:

Post a Comment