Monday, September 8, 2014

జీవితమే ఒక పయణం

చిత్రం  :  విజేత (1985)
సంగీతం  :  చక్రవర్తి
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  :  బాలు 


పల్లవి :


హే..హే... హే..హే.. హే...
ఓ..లలలలాల...


జీవితమే ఒక పయణం.. యవ్వనమే ఒక పవనం..
వేగం వలపు రాగం ఎంత మధురం..
పోద్దాం.. చేరుకుంద్దాం ప్రేమ తీరం...


హే..హే... హే... జీవితమే ఒక పయణం..



చరణం 1 :


లయలో.. నీ లయలో...  నీ వయ్యారమే చూడనా...
జతలో.. నీ జతలో..  నీ అందాలు వేటాడనా...
వడిలో.. నీ వడిలో...  పూల ఉయ్యాలలే ఊగనా...
వలపే.. నా గెలుపై ప్రేమ జండాలు ఎగరేయనా...


ఈ లోకమే మన ఇల్లుగా..
పట్టాలే కలిపేసి... చెట్టపట్టాలు పట్టెయ్యనా...


జీవితమే ఒక పయణం.. 


చరణం 2 :


ఎగిరి.. పైకెగసి.. నే తారల్ని తడిమెయ్యనా...
తారా.. దృవతారా.. నీ తళుకుల్ని ముద్దాడనా..
రాణి.. మహరాణి.. నా పారాణి దిద్దేయ్యనా..
బోణీ.. విరిబోణి.. తొలిబోణీలు చేసేయ్యనా...


మేఘాలలో ఊరేగుతూ..
మెరుపుల్లో చినుకుల్లో... సిగ్గంత దోచేయనా...


జీవితమే ఒక పయణం.. 


చరణం 3 :


అలల.. ఊయలలా నిను ఉర్రుతలూగించనా..
తడిసే.. నీ ఎదలో నే తాపాలు పుట్టించనా.. ఆ.. ఆ.. 

మురిసే నవ్వులలో ఆణిముత్యాలు పండించనా...

మెరిసే కన్నులలో నీలి స్వప్నాలు సృష్టించనా.. 

కెరటాలకే ఎదురీదుతూ..
వెన్నెల్లా.. నావల్లో.. ఈ సంద్రాలు దాటెయ్యనా...




జీవితమే ఒక పయణం.. యవ్వనమే ఒక పవనం..
వేగం వలపు రాగం ఎంత మధురం..
పోద్దాం.. చేరుకుంద్దాం ప్రేమ తీరం...


హే.. హేహే... హె..హేహేహే..
ఓ..లలలలలాలా... 


No comments:

Post a Comment