Monday, September 1, 2014

ధనమేరా అన్నిటికీ మూలం

చిత్రం :  లక్ష్మీ నివాసం (1968)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల 


పల్లవి :


ధనమేరా అన్నిటికీ మూలం...
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం .....
ధనమేరా అన్నిటికీ మూలం...
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం .....
ధనమేరా అన్నిటికీ మూలం .....


మానవుడే ధనమన్నది సృజియించెనురా..
దానికి తానే తెలియని దాసుడాయెరా .....
మానవుడే ధనమన్నది సృజియించెనురా..
దానికి తానే తెలియని దాసుడాయెరా...


ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే ...
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా ...
ధనమేరా అన్నిటికీ మూలం .....   


చరణం 1:


ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా...
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా .....
ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా...
లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా


కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే .....
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
అయ్యో.. కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే .....
ధనమేరా అన్నిటికీ మూలం ..... 


చరణం 2 :


కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా .....
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లో ధనమున్నదిరా .....


శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం ...
శ్రమజీవికి జగమంతా లక్ష్మీనివాసం...
ఆ శ్రీదేవిని నిరసించుట తీరని దోషం .....


ధనమేరా అన్నిటికీ మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవధర్మం .....
ధనమేరా అన్నిటికీ మూలం .....



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7011

No comments:

Post a Comment