Sunday, September 14, 2014

వల్లభా...ప్రియ వల్లభా

చిత్రం :  శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966)
సంగీతం : పెండ్యాల
నేపధ్య గానం : జానకి  




పల్లవి :


వల్లభా..ఆ..ఆ...  ప్రియ వల్లభా..
వల్లభా..ఆ..ఆ..ఆ. ప్రియ వల్లభా..
నాలో వలెనే నీలోనూ..
జిలిబిలి ఊహలు సాగేనా...
కలవరములు చెలరేగేనా..ఆ..ఆ..ఆ...


వల్లభా..ఆ..ఆ...ఆ.. ప్రియ వల్లభా 


చరణం 1 :


అపుడే విరిసిన పువ్వులలో..ఓ.. ఓ... ఓ..
అపుడే విరిసిన పువ్వులలో.. గుప్పుమనే పరిమళమువలే
బుగ్గలకావిరి తగిలేలా.. సిగ్గులు సెగలై చెలగేనా..ఆ..... ఆ...... ఆ.....


వల్లభా..ఆ..ఆ.... ప్రియ వల్లభా 


చరణం 2 :


చంద్రుని చూసిన సంద్రములో..ఓ..ఓ...ఓ..
చంద్రుని చూసిన సంద్రములో.... సందడి చేసే అలలవలే
కొల్లగ మమతలు మూచేనా.... చల్లగ వలపులు వీచేనా...ఆ..ఆ..ఆ


వల్లభా...ప్రియ వల్లభా..
నాలో వలెనే నీలోనూ..
జిలిబిలి ఊహలు సాగేనా...
కలవరములు చెలరేగేనా..ఆ..ఆ..ఆ..
వల్లభా....ఆ...


No comments:

Post a Comment