Tuesday, September 9, 2014

అదిగో నవలోకం




చిత్రం  :  వీరాభిమన్యు (1965)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత  : ఆరుద్ర
నేపథ్య గానం  : ఘంటసాల, సుశీల



పల్లవి :


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అదిగో నవలోకం వెలసే మన కోసం
అహహాహాహా ఓహొహొహొ
అదిగో నవలోకం వెలసే మనకోసం
అదిగో నవలోకం వెలసే మనకోసం 



చరణం 1 :



నీలినీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై
నీలినీలి మేఘాల లీనమై
ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై


దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోరవలపు సీమలో ఆగుదాం
దూర దూర తీరాలకు సాగుదాం
సాగి దోరవలపు సీమలో ఆగుదాం


ఎచట సుఖముందో ఎచట సుధ కలదో
అచట మనముందామా ఆఆఆఆ
అదిగో నవలోకం వెలసే మనకోసం
 


చరణం 2 :


పారిజాత సుమదళాల పానుపూ
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ
పారిజాత సుమదళాల పానుపూ
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ


ఫలించె కోటి మురిపాలు ముద్దులు
మన ప్రణయానికి లేవు సుమా హద్దులు
ఫలించె కోటి మురిపాలు ముద్దులూ
మన ప్రణయానికి లేవు సుమా హద్దులూ


ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో
అచట మనముందామా ఆఆఆఆ
అదిగో నవలోకం వెలసే మనకోసం
అదిగో నవలోకం వెలసే మనకోసం



No comments:

Post a Comment