Wednesday, September 24, 2014

కుచ్చిళ్లు జీరాడు కోక కట్టి

చిత్రం :  సావాసగాళ్లు (1977)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల 

పల్లవి : 

కుచ్చిళ్లు జీరాడు కోక కట్టి...ఆ కొంగులోన దోరవయసు దాచిపెట్టి..
నిలు నిలు నిలవమంటే నా తరమా... నిన్ను నిలువెల్ల దోచకుంటే మగతనమా...
నిలు నిలు నిలవమంటే నా తరమా... నిన్ను నిలువెల్ల దోచకుంటే మగతనమా...

కుచ్చిళ్లు జీరాడు కోక కట్టి... ఆ కొంగులోన కోరికంతా మూటకట్టి...
నిలు నిలు నిలవమంటే నా తరమా... నీకు నిలువు దోపిడివ్వకుంటే ఆడతనమా...
నిలు నిలు నిలవమంటే నా తరమా... నీకు నిలువు దోపిడివ్వకుంటే ఆడతనమా... 

చరణం 1 : 

సిగలోన ముడిచావు మల్లెపూలు...అవి చెప్పినవి ఇన్నాళ్ళ నీ ఊసులు..
సిగలోన ముడిచావు మల్లెపూలు...అవి చెప్పినవి ఇన్నాళ్ళ నీ ఊసులు..
ఏడాది కిందటి జ్ఞాపకాలు...
ఏడాది కిందటి జ్ఞాపకాలు... ఎగజిమ్ముతున్నాయి... ఘుమఘుమలు...
ఘుమఘుమలు...

నిలు నిలు నిలవమంటే నా తరమా...నీకు నిలువు దోపిడివ్వకుంటే ఆడతనమా...
నిలు నిలు నిలవమంటే నా తరమా...నిన్ను నిలువెల్ల దోచకుంటే మగతనమా... 

చరణం 2 : 

గున్నమావి చిగురు వేసెనూ... ఈ రేయి వెన్నెలకే వేడుకాయెను..
కుర్రతనం నిన్ను కోరెను... నాలోని కోరికలకు వాడి పుట్టెను...

పట్టెమంచం పడుచుదాయెను... దానిపై పరుపుకేదో మెరుపు వచ్చెను...
పట్టెమంచం పడుచుదాయెను... దానిపై పరుపుకేదో మెరుపు వచ్చెను...
ఒట్టేసి పగలు వెళ్లెను... నీ ముందు ఓడనని రాత్రి వచ్చెను...

కుచ్చిళ్లు జీరాడు కోక కట్టి...అహ.. ఆ కొంగులోన కోరికంతా మూటకట్టి...
నిలు నిలు నిలవమంటే నా తరమా... నిన్ను నిలువెల్ల దోచకుంటే మగతనమా... 

చరణం 3 :

నెలవంక చూస్తుంది నీ వంక... ఈ నెల మొత్తం ఇలాగే ఉంటదంట...
నెలవంక చూస్తుంది నీ వంక... ఈ నెల మొత్తం ఇలాగే ఉంటదంట...
చలి గాలి వీస్తుంది కిటికీ వెంటా...చ్...అహ..
చలి గాలి వీస్తుంది కిటికీ వెంటా....
తలుపేసుకుంటేనే మంచిదంటా... మంచిదంటా...అహ..హ..అహ...హ...
అహ..హ..అహ...హ...

కుచ్చిళ్లు జీరాడు కోక కట్టి... ఆ కొంగులోన కోరికంతా మూటకట్టి...
నిలు నిలు నిలవమంటే నా తరమా... నిన్ను నిలువెల్ల దోచకుంటే మగతనమా...
నిలు నిలు నిలవమంటే నా తరమా... నీకు నిలువు దోపిడివ్వకుంటే ఆడతనమా...

No comments:

Post a Comment