Wednesday, September 24, 2014

ఓ చెలి చలి చలి

చిత్రం :  సింహబలుడు (1978)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల 



పల్లవి :



ఆ... అహా.. అహహ.. హా
ఆ... అహా.. అహహ.. హా
ఆహహా..ఉమ్మ్.ఉమ్మ్..ఉ... 


ఓ చెలి.. చలి చలి.. ఇదేమి మంటలే..
ఓ చెలి.. చలి చలి.. ఇదేమి మంటలే..


నా ప్రియా.. చలి గిలి మన ప్రేమ మంటలే...
నా ప్రియా.. చలి గిలి మన ప్రేమ మంటలే...


నడి రేయిలో ఎదో ఎదో తొలి హాయి రేగెలే..
ఓ చెలి.. చలి చలి.. ఇదేమి మంటలే.. 


అందమైన ఆ చలి .. కోరే కౌగిలి..
అందమైన ఆ చలి .. కోరే కౌగిలి..
ఆపలేని  నా చలి.. తీర్చవే చెలి..
ఓ చెలి.. చలి చలి.. ఇదేమి మంటలే.. 



చరణం 1 :


నేనే గువ్వనై.. నా నువ్వే గూడువై.. హా..
నేనే గువ్వనై.. నా నువ్వే గూడువై..
తోడుగా.. నీడగా.. ఈడుగా... జోడుగా.. నువ్వుంటే చాలులే..


గుడిలో గంటగా.. నా ఒడిలో జంటగా..
గుడిలో గంటగా.. నా ఒడిలో జంటగా..
నీవు నా ప్రాణమై.. నేను నీదాననై.. మనముంటే చాలులే
 



ఓ చెలి.. చలి చలి.. ఇదేమి మంటలే..
నా ప్రియా.. చలి గిలి మన ప్రేమ మంటలే...
నడి రేయిలో ఎదో.. ఎదో తొలి హాయి రేగెలే..
ఓ చెలి.. చలి చలి.. ఇదేమి మంటలే..   



చరణం 2 :



నవ్వే కన్నుల.. నా నువ్వే వెన్నెల..
నవ్వే కన్నుల.. నా నువ్వే వెన్నెల..
నింగినై పొంగనా.. తారనై చేరనా... ఇక నీలో నీవుగా...


ఎదలో కోరికా.. నా ఎదుటే తీరగా..
ఎదలో కోరికా.. నా ఎదుటే తీరగా..
అందమే పండగా.. బంధమై ఉండనా... ఇక నేనే నీవుగా..



ఓ చెలి చలి చలి.. ఇదేమి మంటలే.. హహా...
నా ప్రియా చలి గిలి మన ప్రేమ మంటలే...
నడి రేయిలో ఎదో ఎదో తొలి హాయి రేగెలే..
ఓ చెలి చలి చలి.. ఇదేమి మంటలే..
లలలలలలల.. లలలలలలలా.. 



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=787

No comments:

Post a Comment