Friday, October 10, 2014
కనుబొమ్మల పల్లకిలోనా
చిత్రం : నెలవంక (1983)
ఈ కోవెల వాకిలిలో .. ఏదో అడుగు సవ్వడి ..
హరివిల్లై పెదవి వదలినా .. చిరునవ్వే వరమయ్యిందీ ..
నీ కన్నుల వెన్నెల చూసీ .. మనసే చిరుతరగయ్యిందీ ..
దయ నిండిన గుండెను చూసీ .. తనువే ఒక పులకయ్యిందీ ..
కనురెప్పల గొడుగును వేసీ .. తోడునీడనౌతాను
నీ జడలో మొగలిరేకునై .. బతుకు పంచుకుంటాను
కనుబొమ్మల పల్లకిలోనా .. కన్నెసిగ్గు వధువయ్యిందీ ..
అంతరంగమిదుగో స్వామీ .. నేడు మీకు నెలవంటానూ
నీ కన్నుల వెన్నెల చూసీ .. మనసే చిరుతరగయ్యిందీ ..
దయ నిండిన గుండెను చూసీ .. తనువే ఒక పులకయ్యిందీ ..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment