Sunday, October 12, 2014

అవ్వబువ్వ కావాలంటే

చిత్రం : సోగ్గాడు (1975)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి :


అవ్వబువ్వ కావాలంటే ... అయ్యేదేన అబ్బాయీ

అబ్బాయీ..  ఓ..అబ్బాయీ

అవ్వబువ్వ కావాలంటే ... అయ్యేదేన అబ్బాయీ

అబ్బాయీ..  ఓ అబ్బాయీ


అయ్యేదాకా...ఆ...

ఆగావంటే...ఆ...

అయ్యేదాక ఆగావంటే ... అవ్వైపోతావ్ అమ్మాయీ ... అమ్మాయీ...ఈ...

అయ్యేదాక ఆగావంటే .. అవ్వైపోతావ్ అమ్మాయీ ... అమ్మాయీ..  ఓ..అమ్మాయీ


లాలాలా... మ్మ్...హు...మ్మ్ హు...

లాలాలా ... మ్మ్...హు...మ్మ్ హు...


చరణం 1 :


అయ్యో పాపం అత్తకొడుకువని ... అడిగినదిస్తానన్నాను..ఆ...

వరసా వావి వుందికదా అని..నేనూ ముద్దే..అడిగాను

అయ్యో పాపం అత్తకొడుకువని ... అడిగినదిస్తానన్నాను

అహ్.. వరసా వావి వుందికదా అని..నేనూ ముద్దే..అడిగాను

నాకు ఇద్దామని వుందీ ... కాని అడ్డేంవచ్చిందీ

నాకు ఇద్దామని వుందీ .... కాని అడ్డేంవచ్చిందీ

అంతటితో నువ్ ఆగుతావని నమ్మకమేముందీ....


అబ్బాయీ...ఓ...అబ్బాయ్యీ


అయ్యేదాక ఆగావంటే...  అవ్వైపోతావ్ అమ్మాయీ

అమ్మాయీ... ఓ... అమ్మాయీ


చరణం 2 :


బస్తీకెళ్ళే మరదలుపిల్లా ... తిరిగొస్తావా మళ్ళీ ఇలా

ఇంతకన్నా ఎన్నో ఎన్నో ... సొగసులు ఎదిగీవస్తాను


బస్తీకెళ్ళే మరదలుపిల్లా ... తిరిగొస్తావా మళ్ళీ ఇలా

ఇంతకన్నా ఎన్నో ఎన్నో ... సొగసులు ఎదిగీవస్తాను

ముడుపుకట్టుకొని తెస్తావా ... మడికట్టుకొని నువ్ వుంటావా

ముడుపుకట్టుకొని తెస్తావా ... మడికట్టుకొని నువ్ వుంటావా

ఈలకాచి నక్కలపాలు ... కాదని మాటిస్తావా...

 

అమ్మాయీ.. ఓ.. అమ్మాయీ


అవ్వబువ్వ కావాలంటే .. అయ్యేదేన అబ్బాయీ

అబ్బాయీ ఓ..అబ్బాయీ


చరణం 3 :


పల్లెటూరి బావకోసం... పట్టాపుచ్చుకొని వస్తాను

పచ్చపచ్చని బ్రతుకే నీకు... పట్టారాసి ఇస్తాను


పల్లెటూరి బావకోసం... పట్టాపుచ్చుకొని వస్తాను

పచ్చపచ్చని బ్రతుకే నీకు... పట్టారాసి ఇస్తాను

సమకానికి నువ్ వస్తావా... కామందుగ నువ్ వుంటావా

సమకానికి నువ్ వస్తావా... కామందుగ నువ్వ్ వుంటావా

సిస్తు లేని కట్టేలేని... సేద్యం చేస్తానంటావా

అబ్బాయీ..ఓ..అబ్బాయీ


అవ్వబువ్వ కావాలంటే...అయ్యేదేన అబ్బాయీ

అబ్బాయీ ఓ.. అబ్బాయీ


అయ్యేదాక ఆగావంటే... అవ్వైపోతావ్ అమ్మాయీ

అమ్మాయీ... అ... అమ్మాయీ



No comments:

Post a Comment