Wednesday, October 8, 2014

లాలేలో లిల్లేలేలో రామలా లొయిలాల

చిత్రం  :  సూత్రధారులు (1989)
సంగీతం  :  కె.వి. మహదేవన్
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం  :  బాలు, ఎస్. పి. శైలజ
 




పల్లవి :


లాలేలో లిల్లేలేలో రామలా లొయిలాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామలా లొయిలాల అమ్మలాలో...


ఊ..ఊ..మూడు బురుజుల కోట ముత్యాల తోట
ముంగిట్లో చిన్నారి బావకు మురిపాల పీటా


మూడు బురుజుల కోట ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట


లాలేలో లిల్లేలేలో రామలా వొయిలాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామలా వొయిలాల అమ్మలాలో 


చరణం 1 :



ఓ... ఇంతలేసి కళ్ళున్నఇంతి మనసు చేమంతా? ముద్దబంతా? చెప్పరాదా చిగురంత..
ఇంతలోనే చెప్పుకుంటే కొంటె వయసు అన్నన్నా వదిలేనా.. నన్నైనా... నిన్నైనా ..


ఇంతలేసి కళ్ళున్న..ఇంతి మనసు చేమంతా? ముద్దబంతా? చెప్పరాదా చిగురంత...
ఇంతలోనే చెప్పుకుంటె కొంటె వయసు.. అన్నన్నా... వదిలేనా నన్నైనా... నిన్నైనా ...


కిన్నెరల్లే కన్నె పరువం ..ఉ..ఉ.. కన్ను గీటి కవ్విస్తే ..
ఉన్న వేడి ఉప్పెనల్లే..ఏ..ఏ.. ఉరకలేసి ఊరిస్తే...

లాలేలో లిల్లేలేలో రామలావొయిలాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామలావొయిలాల అమ్మలాలో



చరణం 2 :


ఓ... గడుసు గాలి పడుచు మొగ్గ తడిమిపోతే కాయౌనా? పండౌనా? కామదేవుని పండగౌనా? 

కాముడై లగ్గమెట్టి కబురుపెడితే వారమేల? వర్జమేల? వల్లమాలిన వంకలేల? 

గడుసు గాలి పడుచు మొగ్గ తడిమిపోతే కాయౌనా? పండౌనా? కామదేవుని పండగౌనా?

కాముడై లగ్గమెట్టి కబురుపెడితే వారమేల? వర్జమేల? వల్లమాలిన వంకలేల?


ముసురుకున్న ముద్దులన్నీ మూడుముళ్ళ గుత్తులైతే ..కలవరించు పొద్దులన్ని..ఈ..ఈ.. కాగిపోయి కౌగిలైతే...


మూడు బురుజుల కోట.. ముత్యాల తోట
సందిట్లో వయ్యారి మరదలికి.. సరసాల మూట ...
లాలేలో లిల్లేలేలో రామలావొయిలాల అమ్మలాలో
లాలేలో లిల్లేలేలో రామలావొయిలాల అమ్మలాలో...



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12423

No comments:

Post a Comment