Monday, October 27, 2014

తొలి చూపు ఒక పరిచయం

చిత్రం :  అద్దాల మేడ (1981)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  దాసరి
నేపధ్య గానం :  బాలు, సుశీల 




పల్లవి :


తొలి చూపు ఒక పరిచయం
మలి చూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో... ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం.. అనురాగపు తొలి రంగం



తొలి చూపు ఒక పరిచయం
మలి చూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో... ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం.. అనురాగపు తొలి రంగం


తొలి చూపు ఒక పరిచయం... మలి చూపు ఒక అనుభవం 


చరణం 1 :

ఆ ఆ హా.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
లాలాల లలల్ల..
లా లా.. ఆ హా


ఒక పువ్వు పూచిన చోట... ఆ పువ్వు నవ్విన చోట
ఒక పువ్వు పూచిన చోట... ఆ పువ్వు నవ్విన చోట
వెలిసింది దేవాలయం... అదే ప్రేమాలయం...


ఒక రాగం పిలిచిన చోట... అనురాగం పలికిన చోట
వెలిసింది రాగాలయం... అదే ప్రేమాలయం... అదే ప్రేమాలయం...


తొలి చూపు ఒక పరిచయం
మలి చూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో... ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం.. అనురాగపు తొలి రంగం


తొలి చూపు ఒక పరిచయం... మలి చూపు ఒక అనుభవం 



చరణం 2 :


మలి సంధ్య ముగిసిన చోట... జాబిల్లి విరిసిన చోట
మలి సంధ్య ముగిసిన చోట... జాబిల్లి విరిసిన చోట
వెలిసింది హృదయాలయం... అదే ప్రేమాలయం..



ఆకాశం వంగిన చోట... భూదేవిని తాకిన చోట
వెలిసింది ఒక ఆలయం... అదే ప్రేమాలయం... అదే ప్రేమాలయం 


తొలి చూపు ఒక పరిచయం
మలి చూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో... ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం.. అనురాగపు తొలి రంగం


తొలి చూపు ఒక పరిచయం... మలి చూపు ఒక అనుభవం 


లా.. ల లా.. ల లా ల ఉహు..హు.. హుహు..హు


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5401

No comments:

Post a Comment