Monday, October 27, 2014

కలలే కన్నానురా

చిత్రం :  అసాధ్యుడు (1968)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  జానకి 





పల్లవి :


కలలే కన్నానురా... ఆశతో ఉన్నానురా... త్వరగా రావేమిరా....

కలలే కన్నానురా..... 


చరణం 1 :




వెన్నెల్లో ఈ రేయి...విరబూసి ఉందోయి...
నీలాల కనుదోయి ....నిన్నే వెతికేనోయి....
వెన్నెల్లో ఈ రేయి...విరబూసి ఉందోయి...
నీలాల కనుదోయి ....నిన్నే వెతికేనోయి....


సొగసులన్ని దోచుకో... నన్ను నీలో దాచుకో...
కలలే కన్నానురా.... 


చరణం 2 : 


నా సిగ్గు దోచేవు... నను చూసి నవ్వేవు....
మెరుపల్లే మెరిసేవు... మురిపించి పొయేవు...
కనులముందే ఉండిపో... మనసునిండా నిండిపో...
కలలే కన్నానురా... 


చరణం 3 :



లా...లా...లా..లా...
లలా....లలా....లలా....
పులకించే నా మేను...ఏమేమో కోరేను...
నిను చేరా రాలేను...ఒంటరిగా మనలేను...
పులకించే నా మేను...ఏమేమో కోరేను...
నిను చేరా రాలేను...ఒంటరిగా మనలేను...
వలపుపోంగే వేళరా...నీవు నాతో చేరరా....


కలలే కన్నానురా.....ఆశతో ఉన్నానురా......
త్వరగా....రావేమిరా....




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3004

No comments:

Post a Comment