Tuesday, October 14, 2014

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు

చిత్రం : స్వర్ణ కమలం (1988)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : సిరివెన్నెల

నేపధ్య గానం : బాలు,  సుశీల


పల్లవి :  


ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు

ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు

నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు

నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు

పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు

ఆమె :

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు

ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు

వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు

వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు

యెల్లలన్నవే యెరగని వేగంతో వెళ్ళు

ఆమె

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు

ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళు


చరణం 1 :

అతడు : లయకే నిలయమై నీ పాదం సాగాలి..

ఆమె : ఆహహహహా..

అతడు : మలయానిల గతిలో సుమబాలగా తూగాలి

 ఆమె : వలలో వొదుగునా విహరించే చిరుగాలికి... సెలయేటికి నటనం నేర్పించే గురువేడీ?

అతడు : తిరిగే కాలానికీ..

ఆమె :   ఆ..ఆ... ఆ..ఆ...

అతడు : తిరిగే కాలానికి తీరొకటుందీ...

ఆమె : అది నీ పాఠానికి దొరకను అందీ

అతడు : నటరాజ స్వామి జటా జూటిలోకి చేరకుంటే

విరుచుకుపడు సురగంగకు విలువేముందీ?... విలువేముందీ?

ఆమె : ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు

అతడు : ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు


చరణం 2 :

ఆమె : దూకే అలలకూ యే తాళం వేస్తారూ..

అతడు : ఆహాహా..

కమ్మని కలల పాట యే రాగం అంటారు

అతడు : అలలకు అందునా ఆశించిన ఆకాశం

కలలా కరగడమా జీవితాన పరమార్థం?

ఆమె : వద్దని ఆపలేరు...

అతడు :  ఆఆ..ఆ..ఆ.. ఆ..ఆ..

ఆమె : వద్దని ఆపలేరు ఉరికే ఊహనీ

అతడు : హద్దులు దాటరాదు ఆశల వాహినీ

ఆమె :  అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే

విరి వనమున పరిమళముల విలువేముందీ?... విలువేముందీ?

 

అతడు : ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు

ఆమె : ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళు

అతడు : నల్ల మబ్బు చల్లనీ చల్లని చిరు జల్లు

ఆమె : వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు

అతడు : పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు

ఆమె : ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు

అతడు : ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వళ్ళు





No comments:

Post a Comment