Thursday, October 30, 2014

ఎప్పుడో ఏదో చూచి





చిత్రం: తొలికోడి కూసింది (1981)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: బాలు, సుశీల 




పల్లవి :



ఎప్పుడో ఏదో చూచి.. ఇప్పుడా ఇదే తలచి
ఎప్పుడో ఏదో చూచి.. ఇప్పుడా ఇదే తలచి
నా సామీ రంగ నవ్వాను మైమరచి...


పైటకు పొగరెక్కి ఎగిరిందిరోయ్
పరువం నునుపెక్కి మెరిసిందిరోయ్
ఆ సోకంత చూశాక ఒళ్లు జల్లుమన్నది  కళ్ళు జిగేల్ మన్నవి  తస్సాదియ్యా


చాకల్లే నీ చూపు అహ దూసిందబ్బీ
అది నా గుండెలో గాయం చేసిందమ్మీ 


ఎప్పుడో ఏదో చూచి.. ఇప్పుడా ఇదే తలచి
నా సామీ రంగ నవ్వాను మైమరచి...



చరణం 1 :


పావడ ఓణీలో నిను చూస్తినీ.. ప్రాయం రాలేదు అనుకొంటిని..
చిగురాకుళ్లో సిరిమల్లె  నినడిగి పూయదు నీతోటి చెప్పదు..  తస్సాదియ్యా


అహ.. నాకోసం కాకుంటే ఆ కోకెందుకు?
కోకుంటే చాలంటే ఇక  నేనెందుకు?    


ఎప్పుడో ఏదో చూచి.. ఇప్పుడా ఇదే తలచి
నా సామీ రంగ నవ్వాను మైమరచి... 



చరణం 2 :


నిద్దరలో నన్ను నువు చూస్తివి.. ముద్దులు పక్కంత కురిపిస్తివి
అది నీకెట్ట తెలిసింది ఎగిరొచ్చి ఓ ముద్దు బుగ్గ మీద పడ్డదా.. తస్సాదియ్యా
అది నీకెట్ట తెలిసింది ఎగిరొచ్చి ఓ ముద్దు బుగ్గ మీద పడ్డదా.. తస్సాదియ్యా  


స్వప్నాలు నిజమైతే అది స్వర్గాలబ్బీ
నువ్వు ఊ అంటే స్వర్గాలు సొంతాలమ్మీ

ఎప్పుడో ఏదో చూచి.. ఇప్పుడా ఇదే తలచి
నా సామీ రంగ నవ్వాను మైమరచి...  నవ్వాను మైమరచి



No comments:

Post a Comment