Tuesday, October 7, 2014

కనులు కనులతో కలబడితే

చిత్రం :  సుమంగళి (1965)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల




పల్లవి :



కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి....... కలలే
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి....... కలలే
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి.......... మరులే
మరులు మనసులో స్ధిరపడితే ఆపై జరిగేదేమి........ మనువూ.. ఊ ఊ ఊ
మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి........ సంసారం..
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి....... కలలే



చరణం 1 :


అల్లరి ఏదో చేసితిని.. చల్లగ ఎదనే దోచితివి
అల్లరి ఏదో చేసితిని.. చల్లగ ఎదనే దోచితివి


ఏమీ లేని పేదననీ.. నాపై మోపకు నేరాన్ని
ఏమీ లేని పేదననీ.. నాపై మోపకు నేరాన్ని


లేదు ప్రేమకు పేదరికం.. నే కోరను నిన్నూ ఇల్లరికం
నింగీ నేలకు కడు దూరం మన ఇద్దరి కలయిక విడ్డూరం


కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి.......కలలే
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి..........మరులే
మరులు మనసులో స్ధిరపడితే ఆపై జరిగేదేమి........మనువూ.. ఊ ఊ ఊ
మనువై ఇద్దరు ఒకటైతే ఆ మనుగడ పేరేమి........సంసారం..
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి.......కలలే


No comments:

Post a Comment