Thursday, October 9, 2014

ఓ..బాలరాజా.. ప్రేమే ఎరుగవా

చిత్రం :  సొమ్మొకడిది సోకొకడిది (1979)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు,  జానకి  
 



పల్లవి :


ఓ..బాలరాజా.. ప్రేమే ఎరుగవా
ఓ..బాలరాజా.. ప్రేమే ఎరుగవా
అందమైన ఆడపిల్ల..చెంత చేరి సందెవేళ
అడగలేక అడగరానిది అడుగుతుంటే..
జాలిలేదా..  బాలరాజా.. బాలరాజా
ఓ..బాలరాజా.. ప్రేమే ఎరుగవా 



చరణం 1 :


మల్లెపూలు ఎర్రగుంటది.. ఎన్నలైన ఎండగుంటదీ
మల్లెపూలు ఎర్రగుంటది.. ఎన్నలైన ఎండగుంటదీ


వయసు వచ్చి వళ్ళు చేస్తది.. వగలు రేపి ఏడిపిస్తది
నాడి చూ
స్తావో.. రాజా నాటుమందే వేస్తావో..

నీటుగాడ ఘాటుప్రేమ.. నాడి చూస్తావో..ఓ..ఓ..
ఓ..బాలరాజా.. ప్రేమే ఎరుగవా 



చరణం 2 :


పొద్దుటేల నిద్దురొస్తదీ.. కొత్తబరువు కొతకొస్తదీ
పొద్దుటేల నిద్దురొస్తదీ.. కొత్తబరువు కొతకొస్తదీ
రాతిరేల జాతరౌతది.. లేత సొగసు పూతకొస్తదీ


మాత్రవేస్తావో.. నాటుమంత్రమేస్తావో..
మోజుతీరి ఫీజు ఇస్తే పుచ్చుకొంటావో..


ఓ..బాలరాజా..ప్రేమే ఎరుగవా
అందమైన ఆడపిల్ల.. చెంత చేరి సందెవేళ
అడగలేక అడగరానిది అడుగుతుంటే..
జాలిలేదా బాలరాజా.. బాలరాజా
ఓ.. బాలరాజా.. ప్రేమే ఎరుగవా 



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5613

No comments:

Post a Comment