Tuesday, October 14, 2014

ఆకాశంలో ఆశల హరివిల్లూ

చిత్రం : స్వర్ణ కమలం (1988)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : సిరివెన్నెల

నేపధ్య గానం : జానకి


పల్లవి :   

 ఆ..... ఆ.... ఆ..... ఆ.....

ఆకాశంలో ఆశల హరివిల్లూ

ఆనందాలే పూసిన పొదరిల్లూ

అందమైనా ఆ లోకం అందుకోనా

ఆదమరచి కలకాలం ఉండిపోనా

 

ఆకాశంలో ఆశల హరివిల్లూ

ఆనందాలే పూసిన పొదరిల్లూ


చరణం 1 :


మబ్బుల్లో తూలుతున్న మెరుపైపోనా

వయ్యారి వానజల్లై దిగిరానా

సంద్రంలో పొంగుతున్న అలనైపోనా

సందెల్లో రంగులెన్నో చిలికెయ్నా

పిల్లగాలే పల్లకీగా... దిక్కులన్నీ చుట్టిరానా

నాకోసం నవరాగాలే... నాట్యమాడెనుగా... 

 

ఆకాశంలో ఆశల హరివిల్లూ

ఆనందాలే పూసిన పొదరిల్లూ

అందమైనా ఆ లోకం అందుకోనా

ఆదమరచి కలకాలం ఉండిపోనా


 చరణం 2 :


స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం

స్వప్నాల సాగరాల సంగీతం

ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం

ముత్యాల తోరణాల ముఖద్వారం

శోభలీనే సోయగాన.. చందమామ మందిరాన

నా కోసం సురభోగాలే.. వేచి నిలిచెనుగా... 

 

 

ఆకాశంలో ఆశల హరివిల్లూ

ఆనందాలే పూసిన పొదరిల్లూ

అందమైనా ఆ లోకం అందుకోనా

ఆదమరచి కలకాలం ఉండిపోనా..

ఆకాశంలో ఆశల హరివిల్లూ...

ఆనందాలే పూసిన పొదరిల్లూ



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=11009

No comments:

Post a Comment