Monday, October 27, 2014

జాణవులె మృదుపాణివిలె

చిత్రం :  ఆదిత్య 369 (1991)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జిక్కి, ఎస్. పి. శైలజ  




పల్లవి :

ఆ... ఆ... ఆ.... ఆ.... ఆ...
నెరజాణవులె.. వరవీణవులె కిలికించితాలలో ఆ హ హ
జాణవులె మృదుపాణివిలె మధుసంతకాలలో...
కన్నులలో... సరసపు వెన్నెలలె..
సన్నలలో ...గుసగుస తెమ్మెరలె
మోవిగని మొగ్గగని.. మోజుపడిన వేళలో..


జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో ఆ హ హ
జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో... 



చరణం 1 :




మోమటుదాచీ మురిపెము పెంచే లాహిరిలో...
ఆ హ హ ఓ హొ హొ హో
ఊగవుగానే మురళిని వూదే వైఖరిలో..
చెలి వొంపులలో హంపికళ ఊగే ఉయ్యాల
చెలి పై యెదలో తుంగ అలా పొంగే ..ఈ వేళ
మరియాదకు విరిపానుపు సవరించవేమిరా..


జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో ఆ హ హ
జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో...
కన్నులలొ సరసపు వెన్నెలలె..
సన్నలలొ గుసగుస తెమ్మెరలె...
మోవిగని మొగ్గగని ..మోజుపడిన వేళలో... 



చరణం 2 : 


చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో...
ఆ హ హ ఓ హొ హొ హో
వెన్నెల తాపం ...వయసుకు ప్రాణం ఈ చలిలో...
చెలి నారతిలా ..హారతిలా నవ్వాలీవేళ..
తొలి సోయగమే.. ఓ సగము.. ఇవ్వాలీవేళ...
పరువానికి.. పగవానికి.. ఒక న్యాయమింక సాగునా...


జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో ఆ హ హ
జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో...
కన్నులలో సరసపు వెన్నెలలె..
సన్నలలో గుసగుస తెమ్మెరలె...
మోవిగని మొగ్గగని ..మోజుపడిన వేళలో...


జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో ఆ హ హ
జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో... 



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10290

No comments:

Post a Comment