Monday, October 13, 2014

ఇదే నా మొదటి ప్రేమ లేఖ

చిత్రం :  స్వప్న (1980)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  రాజశ్రీ

నేపధ్య గానం :  బాలు 


పల్లవి :


ఇదే నా మొదటి ప్రేమ లేఖ.. రాశాను నీకు చెప్పలేక

ఎదుటపడి మనసు తెలుపలేక.. తెలుపుటకు భాష చేత కాక

తెలుపుటకు భాష చేత కాక


ఇదే నా మొదటి ప్రేమ లేఖ.. రాశాను నీకు చెప్పలేక

ఎదుటపడి మనసు తెలుపలేక.. తెలుపుటకు భాష చేతకాక

తెలుపుటకు భాష చేతకాక..


చరణం 1 :


మెరుపనీ పిలవాలంటే.. ఆ వెలుగు ఒక్క క్షణం

పువ్వనీ పిలవాలంటే .. ఆ సొగసు ఒక్క దినం


ఏ రీతిగా నిన్ను.. పిలవాలో తెలియదు నాకు

ఏ రీతిగా నిన్ను.. పిలవాలో తెలియదు నాకు..

తెలిసింది ఒక్కటే .. నువ్వు నా ప్రాణమని

ప్రేమ... ప్రేమా...ప్రేమా


ఇదే నా మొదటి ప్రేమ లేఖ.. రాశాను నీకు చెప్పలేక

ఎదుటపడి మనసు తెలుపలేక.. తెలుపుటకు భాష చేతకాక

తెలుపుటకు భాష చేత కాక


చరణం 2 :


తారవని అందామంటే .. నింగిలో మెరిసేవు

ముత్యమని అందామంటే .. నీటిలో వెలిసేవు


ఎదలోన కదిలే నిన్ను.. దేనితో సరి పోల్చాలో...

ఎదలోన కదిలే నిన్ను .. దేనితో సరి పోల్చాలో

తెలిసింది ఒక్కటే .. నువ్వు నా ప్రాణమని

ప్రేమ... ప్రేమా... ప్రేమా...


ఇదే నా మొదటి ప్రేమలేఖ.. రాశాను నీకు చెప్పలేక

ఎదుటపడి మనసు తెలుపలేక.. తెలుపుటకు  ఉహు..ఉహు...

తెలుపుటకు భాష చేత కాక... 



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=7510

No comments:

Post a Comment