Monday, October 27, 2014

కన్నాడు మా అయ్య

చిత్రం  :  ఆత్మబంధం (1991)
సంగీతం  :  కీరవాణి

గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం  : బాలు, వాణీ జయరాం 

పల్లవి :

కన్నాడు మా అయ్య కన్నయ్య నన్ను నీకు కట్టబెట్టడానికే
కన్నె ఈడు ఉందయ్య చంద్రయ్య సోకు నీకు చుట్టబెట్టడానికే
వన్నె పెంచుకుంటా నాకున్నవిచ్చుకుంటా
నీవన్ని పంచమంటు నేవిన్నవించుకుంటా

కందమ్మా మా అమ్మ కనకమ్మ నన్ను నీకు ఒప్పజెప్పడానికే
కాదన్నా ఆ బ్రహ్మ ఓబొమ్మ నిన్ను కట్టుకోక తప్పదందుకే
మొగ్గ తుంచుకుంటా నా అగ్గి దించుకుంటా
నీ సిగ్గు అంచు వెంట నా ముగ్గులేసుకుంటా

కన్నాడు మా అయ్య కనకయ్య నన్ను నీకు కట్టబెట్టడానికే
కందమ్మా మా అమ్మ కనకమ్మ నన్ను నీకు ఒప్పజెప్పడానికే 

చరణం 1 :

చూడవయ్యా చలాకి లేడినయ్యా చలేసి చేరువయ్యా చులాగ్గ చేదుకో
వేడుకియ్యా కసింత వేడినియ్యా కసంత వాడనియ్యా మరింత చేరుకో
సందుచేసుకో సరైన సందెపొద్దు రంధిలో చందమామ కందిపోవు సందడందుకో
అందగత్తెరో హుషారు తొందరందుకుందిరో చందనాల తందనాల తొందరేందిరో
చిందాడు మైకంలో... కధ ఎందాక పోతుందో...
మందార సోకుల్లో... మతి ఏందారి పడుతుందో...
సందిట పడి కందిన మది సంబరపడి చెంగుమంది
వంద ఏళ్ళ జంట నా కుందనాల పంట నీ విందులేలుకుంటా వేయి వందనాలు అంటా

కన్నాడు మా అయ్య కనకయ్య నన్ను నీకు కట్టబెట్టడానికే
కందమ్మా మా అమ్మ కనకమ్మ నన్ను నీకు ఒప్పజెప్పడానికే 

చరణం 2 : 

పాలపిట్ట పదారు ప్రాయమిట్టా పరాయి గాలివెంట పచారు ఏలనే
పాడుగుట్టే పదంటు పొంగుతుంటే పరాకు జారుపైటే బజారు ఏలెనే
పంతమాడితే పసందు బొంకమెంతో పోల్చనా పొందికైన బంధనాల పంజరానా
పందెమోడితే కసింత పట్టుబడితె పలచన పిందె ఈడు పిండుకున్న పౌరుషానా
అరె పల్లేరు వానమ్మో... అల్లారు ముద్దుబాలా...
పన్నీటి వాగయ్యో... కిల్లారు సంబరాలా...
పందిరి జత అందిన పసికందుకు బుసలెందుకుమరి
పొద్దువాలకుండా రేపొద్దు పాల ఎండా చూపొద్దు వీలు జెండా నా ముద్దు పూల చెండా

కందమ్మా మా అమ్మ కనకమ్మ నన్ను నీకు ఒప్పజెప్పడానికే
కన్నె ఈడు ఉందయ్య చంద్రయ్య సోకు నీకు చుట్టబెట్టడానికే

మొగ్గ తుంచుకుంటా నా అగ్గి దించుకుంటా
నీవన్ని పంచమంటు నేవిన్నవించుకుంటా

కందమ్మా మా అమ్మ కనకమ్మ నన్ను నీకు ఒప్పజెప్పడానికే
కన్నె ఈడు ఉందయ్య చంద్రయ్య సోకు నీకు చుట్టబెట్టడానికే

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=13028

No comments:

Post a Comment