Tuesday, October 14, 2014

శివ పూజకు చిగురించిన

చిత్రం : స్వర్ణ కమలం (1988)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత :  సిరివెన్నెల

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :  


శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వా...

శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వా...

సిరిసిరి మువ్వా...  సిరిసిరి మువ్వా

మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా..

సిరిసిరి మువ్వా...  సిరిసిరి మువ్వా

యతి రాజుకు జతి స్వరముల పరిమళ మివ్వా...

సిరిసిరి మువ్వా...  సిరిసిరి మువ్వా

నటనాంజలితో బ్రతుకును తరించనీవా ...

సిరిసిరి మువ్వా ... సిరిసిరి మువ్వా

 

పరుగాపక పయనించవె తలపుల నావా

కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా

ఎదిరించిన సుడిగాలిని జయించినావా

మది కోరిన మధు సీమలు వరించిరావా

పరుగాపక పయనించవె తలపుల నావా

కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా


చరణం 1 :


పడమర పడగలపై.. మెరిసే తారలకై..

పడమర పడగలపై.. మెరిసే తారలకై..

రాత్రిని వరించకే..  సంధ్యా సుందరీ...


తూరుపు వేదికపై ... వేకువ నర్తకివై..

తూరుపు వేదికపై ... వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే...  కాంతులు చిందనీ...

నీ కదలిక చైతణ్యపు శ్రీకారం కానీ

నీ కదలిక చైతణ్యపు శ్రీకారం కానీ ..

నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని...


శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వా...

సిరిసిరి మువ్వా...  సిరిసిరి మువ్వా

మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వా..

సిరిసిరి మువ్వా... సిరిసిరి మువ్వా


చరణం 2 :


తనవేళ్లే సంకెళ్ళై... కదలలేని మొక్కలా

ఆమనికై ఎదురు చూస్తు .. ఆగిపోకు ఎక్కడా

అవధిలేని అందముంది.. అవనికి నలు దిక్కులా

ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా

ప్రతిరోజొక నవదీపిక స్వాగతించగా

వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా


పరుగాపక పయనించవె తలపుల నావా

కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా


చరణం 3 :


చలిత చరణ జనితం.. నీ సహజ విలాసం

జ్వలిత కిరణ కలితం.. సౌందర్య వికాసం

నీ అభినయ ఉషోదయం.. తిలకించిన రవి నయనం

నీ అభినయ ఉషోదయం.. తిలకించిన రవి నయనం

గగన సరసి హృదయంలో...

వికసిత శతదళ.. శోభల సువర్ణకమలం...


పరుగాపక పయనించవె తలపుల నావా

కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా

ఎదిరించిన సుడిగాలిని జయించినావా... శ్రేయాన్ స్వధర్మో విగుణః

మది కోరిన మధు సీమలు వరించిరావా... పరధర్మాత్ స్వనుష్టితాత్


స్వధర్మే నిధనం శ్రేయః ... పరధర్మో భయావహః



No comments:

Post a Comment