Thursday, October 9, 2014

అబ్బో నేరేడు పళ్ళు

చిత్రం :  సొమ్మొకడిది సోకొకడిది (1979)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, జానకి 



పల్లవి :


అబ్బో...
అబ్బో...  నేరేడు పళ్ళు
అబ్బో... నేరేడు పళ్ళు
అబ్బాయి కళ్ళు... అల్లో నేరేడు పళ్ళు
పులుపెక్కే  పోకళ్ళు
కైపెక్కే  ఆకళ్ళు
లేలేత కొబ్బరి నీళ్ళు


అబ్బో నేరేడు పళ్ళు
అబ్బాయి కళ్ళు...  అల్లో నేరేడు పళ్ళు


ఆ..హా.. హేహే... యాయయయాయయా.. యా...


అమ్మో..  గులాబి ముళ్ళు
అమ్మాయి కళ్ళు...  గుచ్చే గులాబి ముళ్ళు
ఎరుపెక్కే చెక్కిళ్ళు...  యెదలోన ఎక్కిళ్ళు
కోరేది కొబ్బరి నీళ్ళు


అమ్మో గులాబి ముళ్ళు..
అమ్మాయి కళ్ళు...  గుచ్చే గులాబి ముళ్ళు... హా



చరణం 1 :


ఆ గిరజాల సరదాలు చూస్తుంటే
అబ్బా...  విరజాజి విరబూసి పోతుంటే
ఆ గిరజాల సరదాలు చూస్తుంటే
అబ్బా...  విరజాజి విరబూసి పోతుంటే
నూనూగు మీసాలు... చేస్తున్నా మోసాలు
నే తాళలేనమ్మా ఈ రోజు
నే సైపలేనమ్మా ఆ ఫోజు


పగటి చుక్క అమ్మాయి... వగలమారి సన్నాయి
మోహాలు దాహాలు... నాలో చెలరేగుతున్నాయి 


అమ్మో...  గులాబి ముళ్ళు
అమ్మాయి కళ్ళు...  గుచ్చే గులాబి ముళ్ళు


అబ్బో... నేరేడు పళ్ళు
అబ్బాయి కళ్ళు... అల్లో నేరేడు పళ్ళు... 
హా 


చరణం 2 :


ఆ.. అహా.. ఏ.. రహా...
లలలలలలలలలా.... లలలలలలలలలా 


ఆ జడ పొడుగు... మెడ నునుపు చూస్తుంటే..
ఆ అడుగడుగు నీ వెనకే పడుతుంటే
ఆ జడ పొడుగు... మెడ నునుపు చూస్తుంటే
ఆ అడుగడుగు నీ వెనకే పడుతుంటే
నీలోని అందాలు...  వేస్తున్న బంధాలు
నే నోపలేనమ్మా ఈ రోజు
నేనాపలేనమ్మా ఆ మోజు


పదును చూపు అబ్బాయి...  పగలు చుక్క రాదోయి
మూడు ముళ్ళు పడేదాక... కాస్త... 
అ... నువ్వు ఆగవోయి.. అహా


అబ్బో... నేరేడు పళ్ళు
అబ్బాయి కళ్ళు... అల్లో నేరేడు పళ్ళు
పులుపెక్కే పోకళ్ళు
కైపెక్కే ఆకళ్ళు
లేలేత కొబ్బరి నీళ్ళు



ఎరుపెక్కే చెక్కిళ్ళు...  యెదలోన ఎక్కిళ్ళు

కోరేది కొబ్బరి నీళ్ళు...

అమ్మో గులాబి ముళ్ళు.. అమ్మాయి కళ్ళు గుచ్చే గులాబి ముళ్ళు


యాయయయాయయా... యయాయ... యాయయయాయయా

యాయయయాయయా... యయాయ... యాయయయాయయా



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5758

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Just watched this movie .. very nice and funny and this song is superb
    Telugu Lyrics

    ReplyDelete