Tuesday, October 7, 2014

కన్నులు నీవే కావాలి

చిత్రం :  సుమంగళి (1965)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల




పల్లవి :



ఏనాటికైనా ఏ జన్మనైనా నీ తోడు నీడగా.. నీ చేయి వీడకా...
నీ అడుగుజాడలే అనుసరిస్తాను...


కన్నులు నీవే కావాలి.. కలనై నేనే రావాలి
కవితే నీవై ఉరకాలీ.. కావ్యం నేనై నిలవాలి


కన్నులు నీవే కావాలి.. కలనై నేనే రావాలి
కవితే నీవై ఉరకాలీ.. కావ్యం నేనై నిలవాలి
కన్నులు నీవే కావాలి .... 



చరణం 1 :


మనసు నేనై వుండాలి.. మమత నీవై నిండాలి
మనసు నేనై వుండాలి.. మమత నీవై నిండాలి


కడలి నేనై పొంగాలీ... నదివి నీవై చేరాలీ
కడలి నేనై పొంగాలీ... నదివి నీవై చేరాలీ
నదివీ నీవై చేరాలీ..


కన్నులు నీవే కావాలీ...



చరణం 2 :


తొలకరి నీవై చిలకాలి.. మొలకను నేనై మొలవాలి
తొలకరి నీవై చిలకాలి.. మొలకను నేనై మొలవాలి


దైవం నీవై నడపాలీ.. ధర్మం నేనై నడవాలి
దైవం నీవై నడపాలీ.. ధర్మం నేనై నడవాలి


కన్నులు నీవే కావాలి


చరణం 3 :

శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి

శిల్పం నీవై కల్పన నేనై చిరకాలం జీవించాలి

చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి..

చెరగని మారని శిలాక్షరాలై చిరంజీవులం కావాలి..


కన్నులు నీవే కావాలి.. కలనై నేనే రావాలి...

కవితే నీవై ఉరకాలీ.. కావ్యం నేనై నిలవాలి...

కన్నులు నీవే కావాలి ... 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1576

No comments:

Post a Comment