Wednesday, October 8, 2014

రుక్మిణి కల్యాణం

చిత్రం :  సూత్రధారులు (1989)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  మాడుగుల నాగ ఫణి శర్మ
నేపధ్య గానం :  సుశీల, వి. కల్యాణి
  




పల్లవి :


శ్రీమత్ గజాననం నత్వా
స్తుత్వా శ్రీ సత్య సాయినమ్
శ్రీహరికథాపితామహమహమ్
వందే నారాయణదాస సత్గురుమ్


శ్రీరస్తూ ...శుభమస్తూ...
శ్రీరస్తు శుభమస్తు
సత్కథా లహరికి.. హరికీ ..
ఆగమ లతల కొసల విరిసినా విరికి... హరికీ
కోటి కొంగుల ముడుల పున్నెంబు సిరికి... హరికీ
సిరికీ... హరికీ ..శ్రీరస్తు శుభమస్తు 



చరణం 1 :



యత్ర శ్రీకృష్ణ సంకీర్తనమ్..
తత్ర శుభమంగళ సంవర్తనమ్ ...అని ఆర్యోక్తి..
అలాంటి సర్వమంగళమోహనాకారుడైన ...
శ్రీకృష్ణుడి అనేకానేక లీలా వినోదములలో ...
రుక్మిణీ కల్యాణ సత్కథ మధురాతి మధురమైనది


అందలి నాయికామణి ...ఆ రమణీ లలిత పల్లవపాణి
నీలసుందరవేణి ...అందాలపూబోణి ...ఆ రుక్మిణి
అందాలపూబోణి ...ఆ రుక్మిణి ...


కనులవి తెరచిన చాలు ...యదునందను అందమె గ్రోలూ
కరములు కదలిన చాలు ...కరివరదుని పదముల వ్రాలు
పెదవులు మెదిలిన చాలు ...హరిజపముల తపములదేలు
ఉల్లమంతా నల్లనయ్యే ...వలపు ఓపని వెల్లువై... 



చరణం 2 :


అంతలో..
యదుకేసరితో హరితో ..గిరితో మనవియ్యము
గియ్యము కూడదని ...శిశుపాలుని పాలొనరింతునని
తన సోదరుడాడిన మాటవిని ...దిగులుగొనీ ..దిక్కెవ్వరనీ....


తలపోసి ...తలపోసి తెలవారగా ...తనువెల్ల తపనలో తడియారగా ...
తలపోసి తలపోసి తెలవారగా ...తనువెల్ల తపనలో తడియారగా ...
ప్రళయమే రానున్నదనియెంచెను...
ప్రణయసందేశ మా స్వామికంపెనూ..


ఆ లలిత పల్లవపాణి ...నీలసుందరవేణి ...అందాలపూబోణి
ఆ రుక్మిణిమణికి ...శ్రీరస్తు శుభమస్తు...
శ్రీరస్తు శుభమస్తు 



చరణం 3 :


అగ్రజుడైన రుక్మి తన పంతమే తనదిగా
శిశుపాలుని కిచ్చి వివాహము జరిపింప నిశ్చయింపగా
ఆ చిన్నారి రుక్మిణి...
రానన్నాడో... తానై రానున్నాడో ...
ప్రభువు ఏమన్నాడో ...ఏమనుకున్నాడో
అని మనసున విలవిలలాడు తరుణంబున
అది గ్రహించని చెలికత్తెలా రుక్మిణీదేవికీ...


తిలకము దిద్దిరదే... కళ్యాణ తిలకము దిద్దిరదే
చేలముకట్టిరదే... బంగారు చేలము కట్టిరదే
బాసికముంచిరదే ...నుదుటను బాసికముంచిరదే
పదములనలదిరదే ...పారాణి పదములనలదిరదే ...



ఇవ్విధమ్మున అలంకరింపబడిన రుక్మిణిదేవీ...
శిలపై అసువులుబాయు బలిపశువు చందమ్మున...
అందమ్మును ఆనందమును వీడి...
డెందమ్మున కుందుచుండగా.....


అదిగో వచ్చెను వాడె హరి శ్రీహరీ
అదిగో వచ్చెను వాడె హరి శ్రీహరీ
శ్రీరుక్మిణి హృదయప్రణయాక్షరీ


అదిగో వచ్చెను వాడె ...
వచ్చి వైరుల ద్రుంచి ...వరరత్న మై నిలచి
వనితా మనోరధము తీర్చి ..రథము బూన్చి
జయవెట్ట జనకోటీ .... వెడలే రుక్మిణి తోటి


అదిగో అదిగో వాడే హరి శ్రీహరి...


స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా...
న్యాయేన మార్గేన మహిమ్ మహీశాః...
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యమ్
లోకా సమస్తా సుఖినో భవంతు....



No comments:

Post a Comment