Tuesday, November 4, 2014

ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌

చిత్రం :  ఇల్లరికం (1959)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  ఘంటసాల



పల్లవి : 

ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌

ఎవరే పిలిచారు నిన్నెవరే పిలిచారు

ఎవరే పిలిచారు? నిన్నెవరే పిలిచారు

ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌

ఎవరే పిలిచారు? నిన్నెవరే పిలిచారు



చాటుగా కనుచాటుగా చూడకే ఇటు చూడకే

పొదలలో.. పూ పొదలలో పొంచినా గాలించినా

పొదలలో.. పూ పొదలలో పొంచినా గాలించినా

కనులకు నే కనిపించనులే

ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌

ఎవరే పిలిచారు? నిన్నెవరే పిలిచారు


చరణం 1 :


నీడలో దోబూచిగా... ఆడకే తారాడకే
నీటిలో కోనేటిలో... చూడకే వెదుకాడకే
నీటిలో కోనేటిలో... చూడకే వెదుకాడకే
దాగుడు మూతలు చాలునులే


ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌

ఎవరే పిలిచారు? నిన్నెవరే పిలిచారు


చరణం 2  :


వెదికినా నే దొరకనే... పిలిచినా నే పలుకనే
హృదయమే నా కొసగినా... ఎదుటనే కనిపింతునే
హృదయమే నా కొసగినా... ఎదుటనే కనిపింతునే
ఎన్నటికీ నిను వీడనులే... 

ఎక్కడి దొంగలు అక్కడనే గప్‌చుప్‌

ఎవరే పిలిచారు? నిన్నెవరే పిలిచారు

ఎవరే పిలిచారు? నిన్నెవరే పిలిచారు

No comments:

Post a Comment