చిత్రం : నిప్పులాంటి మనిషి (1974) సంగీతం : సత్యం గీతరచయిత : సినారె నేపధ్య గానం : సుశీల
పల్లవి :
ఏదో అనుకున్నాను.. ఏమేమొ కలగన్నాను . . అంతలో కల కరిగెనా.. ఆ దైవమే పగబూనెనా ఏదో అనుకున్నాను.. ఏమేమొ కలగన్నాను . . అంతలో కల కరిగెనా.. ఆ దైవమే పగబూనెనా . . ఆ . . ఆ . . ఆ . . ఆ
చరణం 1 :
ఏ నీడ లేని దానా.. ఎందుకో నా పైనా . . చల్లనైన ఒక హృదయం జల్లులా కురిసిందీ
ఏ నీడ లేని దానా.. ఎందుకో నా పైనా . . చల్లనైన ఒక హృదయం జల్లులా కురిసిందీ మరునిమిషం ఆ హృదయం తెరపాలైపోయెనా
ఏదో అనుకున్నాను.. ఏమేమొ కలగన్నాను . . అంతలో కల కరిగెనా.. ఆ దైవమే పగబూనెనా . .
చరణం 2 :
పూలెన్నో తెచ్చానూ .. మాలలెన్నో అల్లానూ మనసైన స్వామి మెడలో వేయాలనుకొన్నాను పూలెన్నో తెచ్చానూ.. మాలలెన్నో అల్లానూ మనసైన స్వామి మెడలో వేయాలనుకొన్నాను మరునిమిషం ఆ దైవం కనుమరుగైపొయెనా
ఏదో అనుకున్నాను.. ఏమేమొ కలగన్నాను . . అంతలో కల కరిగెనా.. ఆ దైవమే పగబూనెనా . .
No comments:
Post a Comment