స్వరాల పల్లకి
Guest Book
[Sign My Guestbook]
[View My Guestbook]
Powered by E-Guestbooks Server
.
Monday, November 3, 2014
నేడు శ్రీవారికి మేమంటే పరాకా
చిత్రం : ఇల్లరికం (1959)
సంగీతం :
టి. చలపతిరావు
గీతరచయిత : కొసరాజు
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
నేడు శ్రీవారికి మేమంటే పరాకా..ఆ..ఆ..
తగని బలే చిరాకా... ఎందుకో తగని బలే చిరాకా..ఆ..ఆ..
నేడు శ్రీవారికి మేమంటే పరాకా
చరణం 1 :
మొదలు మగవారు వేస్తారు వేషాలు...
పెళ్ళీకాగానే చేస్తారు మోసం...
ఆ..ఆ.. ఆడవాళ్ళంటే శాంత స్వరూపాలే...
కోపతాపాలే రావండి పాపం ..
కోరి చేరిన మనసు... చేత చిక్కిన అలుసు
కోరి చేరిన మనసు... చేత చిక్కిన అలుసు
కొసకు ఎడబాటు అలవాటు చేస్తారు
నేడు శ్రీమతికి మా తోటి వివాదం ...
తగువే... బలే వినోదం... ఎందుకో ... తగువే బలే వినోదం..ఊ..
నేడు శ్రీమతికి మా తోటి వివాదం...
చరణం 2 :
వారి మనసైతే వస్తారు ఆడవారు...
చేర రమ్మంటే రానేరారు...
తెలుసుకున్నారు స్త్రీల స్వభావాలు..
తెలిసి తీర్చారు ముద్దు మురిపాలు
అలుక సరదా మీకు... అదే వేడుక మాకు
అలుక సరదా మీకు... అదే వేడుక మాకు
కడకు మురిపించి గెలిచేది మీరేలే...
ప్రణయ కలహాల సరసాలే వినోదం ...
నిజమే... బలే వినోదం...ఆ...నిజమే... బలే వినోదం
ఆ...నిజమే... బలే వినోదం....నిజమే... బలే వినోదం
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1519
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment