Thursday, November 27, 2014

ఇది నిశీధ సమయం

చిత్రం :  దేవదాసు (1974)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు 



పల్లవి :


ఇది నిశీధ సమయం అది తిరుగులేని పయనం ఊ..
తిరిగి రాని పయనం తిరిగి రాని పయనం
ఇది నిశీధ సమయం.. అది తిరుగులేని పయనం
తిరిగి రాని పయనం.. ఇది నిశీధ సమయం


ఈ సమయం భ్రాంతి సుమా..  ఆ పయనం మాయ సుమా..
అంటున్న నేను.. వింటున్న నీవు
అంతా మాయసుమా..  అంతా భ్రాంతి సుమా




చరణం 1 :



అయిదు సరుకుల మేళవింపుతో.. తొమ్మిది తలుపుల భవనం
అందులోన నివాసం మాని హంస చేరురా గగనం
తానే లేని సదనంలో తలుపులు ఎందుకురా..
తిరిగి రానే రాని పయనంలో పిలుపులు ఎందుకురా


ఇది నిశీధ సమయం.. అది తిరుగులేని పయనం
తిరిగి రాని పయనం.. ఇది నిశీధ సమయం...
 


చరణం 2 :



మరలా పుట్టుక.. మరలా చచ్చుట ఇరుసే లేని చక్రం
వచ్చేవారూ పొయేవారూ జగతి పురాతన సత్రం
రాకడకైనా పోకడకైనా కర్తవు కావుర నీవు
అన్ని అంచెలు దాటిన పిదప ఉన్నది కడపటి రేవు 


ఇది నిశీధ సమయం.. అది తిరుగులేని పయనం
తిరిగి రాని పయనం..  ఇది నిశీధ సమయం



No comments:

Post a Comment