Tuesday, November 18, 2014

కలుసుకున్న తొలిరోజింకా

చిత్రం : గుణవంతుడు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల 

పల్లవి : 

కలుసుకున్న తొలిరోజింకా.. కన్నులలోనే ఉన్నదిరా..
తెలిసో తెలియక వలచిన మనసు... తలుపులు తెరిచే ఉన్నదిరా

కలుసుకున్న తొలిరోజింకా... కన్నులలోనే ఉన్నదిరా..
తెలిసో తెలియక వలచిన మనసు... తలుపులు తెరిచే ఉన్నదిరా
కలుసుకున్న తొలిరోజింకా... కన్నులలోనే ఉన్నదిరా

చరణం 1 : 

ముద్దూ ముచ్చట తీరక ముందే.. ముద్ర నాలో మిగిలినదీ..
నీ ముద్ర నాలో మిగిలినదీ
ముద్దూ ముచ్చట తీరక ముందే ముద్ర నాలో మిగిలినదీ

చూపులకందక నువ్వున్నా... నీ రూపు నాలో పెరిగినదీ
చూపులకందక నువ్వున్నా... నీ రూపు నాలో పెరిగినదీ

కళ్ళలోకి చూశావూ...  వెళ్ళివస్తానన్నావూ...
కళ్ళలోకి చూశావూ...  వెళ్ళివస్తానన్నావూ
అప్పుడు రెప్పవాల్చని నా కళ్ళూ . . అలాగే ఉన్నవి ఇన్నేళ్ళూ  
  
కలుసుకున్న తొలిరోజింకా...  కన్నులలోనే ఉన్నదిరా 

చరణం 2 :

మహరాజువు నీవన్నారూ...  నీ మమతలు మారేవన్నారూ
మహరాజువు నీవన్నారూ...  నీ మమతలు మారేవన్నారూ

మరుపు మబ్బులో కలిశానో.. నీ మనసు నుండి జారానో
మరుపు మబ్బులో కలిశానో.. నీ మనసు నుండి జారానో

మాటనిచ్చి వెళ్ళావు...  అది పాట చేసుకున్నాను... మాటనిచ్చి వెళ్ళావు... అది పాట చేసుకున్నానుఅప్పుడు నాలో రేగిన ఈ రాగం . . ఆగకున్నది యింత కాలం  

కలుసుకున్న తొలిరోజింకా.. కన్నులలోనే ఉన్నదిరా..
తెలిసో తెలియక వలచిన మనసు... తలుపులు తెరిచే ఉన్నదిరా

కలుసుకున్న తొలిరోజింకా... 

No comments:

Post a Comment