Thursday, November 20, 2014

స్నేహమే నా జీవితం

చిత్రం :  నిప్పులాంటి మనిషి (1974)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  సినారె

నేపథ్య గానం :  బాలు 


 

పల్లవి :



ఆ . . ఆ . . ఆ . . ఆ . . అల్లాయే దిగివచ్చి . . .

అల్లాయే దిగివచ్చి... అయ్ మియా ఏమి కావాలంటే

మిద్దెలొద్దు.. మేడలొద్దూ.. పెద్దలెక్కే గద్దెలొద్దంటాను

ఉన్ననాడు.. లేనినాడు…  ఒకే ప్రాణమై నిలిచే

ఒక్క దొస్తే చాలంటాను... ఒక్క నేస్తం కావాలంటాను 


స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..

స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం

స్నేహమేరా నాకున్నదీ... స్నేహమేరా పెన్నిదీ.. 

స్నేహమే . . హొయ్

స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం...

స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం  


గుండెనే పలికించితే.. గుండెనే పలికించితే..  కోటి పాటలు పలుకుతాయ్

మమత నే పండించితే మణుల పంటలు దొరుకుతాయ్

బాధాలను ప్రేమించు భాయీ..

బాధాలను ప్రేమించు భాయీ.. లేదు అంతకు మించి హాయ్

స్నేహమే . . హొయ్ ! 


స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం

స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం  



చరణం 1 :



కత్తిల పదునైన చురుకైన మా వాడు.. మెత్తబడిపొయాడు ఎందుకో ఈనాడు

కత్తిల పదునైన చురుకైన మా వాడు.. మెత్తబడిపొయాడు ఎందుకో ఈనాడు

ఏమిటొ నీ బాధా ఆ .. ఏమిటొ నీ బాధా నాకైన చెప్పు భాయి


ఆ రహస్యం కాస్త ఇకనైన విప్పవోయి.. ఆ రహస్యం కాస్త ఇకనైన విప్పవోయి

నిండుగ నువ్వు నేడు నావ్వాలి.. అందుకు నేనేమి ఇవ్వాలోయ్… 

నిండుగ నువ్వు నేడు నావ్వాలి.. అందుకు నేనేమి ఇవ్వాలి… 


చుక్కలను కోసుకొని తెమ్మంటావా.. దిక్కులను కలిపేయమంటావా

దింపమంటావా…  

దింపమంటావా ఆ చంద్రుణ్ణి… తుంచమంటావా ఆ సూర్యుణ్ణి . .

ఏమి చెయ్యాలన్న చేస్తాను.. కొరితే ప్రాణమైన ఇస్తాను . .

హ... ఏమి చెయ్యాలన్న చేస్తాను.. కొరితే ప్రాణమైన ఇస్తాను


దొస్తీకి నజరానా..   దొస్తీకి నజరానా..

చిరునవ్వురా నాన్నా..  

దొస్తీకి నజరానా..  చిరునవ్వురా నాన్నా. .

ఒక్క నవ్వే చాలు ఒద్దులే వరహాలు.. 


హ హ హ హ…. 

నవ్వెరా.. నవ్వెరా.. మావాడు..  

నవ్వెరా నిండుగా

నవ్వెరా నా ముందు..  రంజాను పండుగా



స్నేహమే నా జీవితం… స్నేహమేరా శాశ్వతం..

స్నేహమే నా జీవితం… స్నేహమేరా శాశ్వతం


No comments:

Post a Comment